English | Telugu

అశ్లీల‌ కంటెంట్ కోసం ఆషా సైనీని రాజ్ కుంద్రా సంప్ర‌దించాడా?

అశ్లీల‌ కంటెంట్ కోసం ఆషా సైనీని రాజ్ కుంద్రా సంప్ర‌దించాడా?

 

రాజ్ కుంద్రా, అత‌ని వ్యాపార భాగ‌స్వామి ఉమేశ్ కామ‌త‌త్ క‌లిసి 'బాలీఫేమ్' అనే యాప్‌ను తీసుకు వ‌చ్చేందుకు సంకల్పించారు. దానికోసం తీసే సినిమాలో ఓ సాంగ్‌లో న‌టించ‌డానికి 'ల‌క్స్' పాప‌ ఆషా సైనీ అలియాస్ ఫ్లోరా సైనీని వారు సంప్ర‌దించారంటూ మీడియాలో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే దీనిపై వివ‌ర‌ణ ఇస్తూ ఆషా సైనా ఓ వీడియో రిలీజ్ చేసింది. రాజ్‌, ఉమేశ్‌ల‌తో తానెప్పుడూ మాట్లాడ‌లేద‌నీ, వాళ్ల రాబోయే ప్రాజెక్టుల్లో త‌న‌ను న‌టించ‌మ‌ని వారు త‌న‌ను అడ‌గ‌లేద‌నీ అందులో ఆమె వెల్ల‌డించింది.

కాగా లేటెస్ట్‌గా ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడిన ఆమె, ఈ వివాదంలో త‌న‌ను అన‌వ‌స‌రంగా లాగార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తానెప్పుడూ రాజ్‌తో ఇంట‌రాక్ట్ కాలేద‌ని స్ప‌ష్టం చేసింది. "క్యాస్టింగ్ మ‌నుషులు అప్పుడ‌ప్పుడు ఫోన్లు చేస్తుంటారు. హాట్‌షాట్స్ యాప్ కోసం ఓ వెబ్ సిరీస్ తీస్తున్నారు, మీరు అందులో న‌టిస్తారా? అన‌డిగారు. నేను చెయ్య‌న‌ని వాళ్ల‌కు చెప్పాను. ఎందుకంటే త‌క్కువ బ‌డ్జెట్‌తో తీసే కొన్ని ర‌కాల‌ కంటెంట్‌ను రూపొందించే కొత్త ప్లాట్‌ఫామ్‌లతో నేను ప‌ని చేయ‌ను. నేను ప‌నికోసం వెంప‌ర్లాడ‌టం లేదు." అని ఆమె తెలిపింది.

"అశ్లీల చిత్రాల‌కు సంబంధించిన ఈ కేసులో న‌న్ను లాగ‌డం ద్వారా, అందులో నా జోక్యం ఉంద‌ని వారు నొక్కిచెబుతున్నారు. ఇది నా హ‌క్కుల్ని ఉల్లంఘించ‌డ‌మే. ఎందుకంటే నేను ఓ ఫిల్మ్ ఫ్యామిలీకి చెందిన‌దాన్ని కాదు, అందువ‌ల్ల ఇందులోకి నాపేరు లాగ‌డం వ‌ల్ల ఇబ్బంది ఉండ‌ద‌ని వార‌నుకుంటున్నారు. ఈ త‌ర‌హా ప‌బ్లిసిటీని నేను కోరుకోను." అని తేల్చి చెప్పింది ఆషా సైనీ.