English | Telugu

కొడుక్కు బెయిల్ రాక‌పోవ‌డంతో షారుక్ ఖాన్ భార్యకు భారంగా బ‌ర్త్‌డే!

శుక్ర‌వారం అక్టోబ‌ర్ 8 బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ గౌరీ ఖాన్ 51వ పుట్టిన‌రోజు. ప్ర‌తి బ‌ర్త్‌డేకీ సంద‌డి సంద‌డిగా ఉండే షారుక్ ఇల్లు ఈరోజు నిశ్శ‌బ్దంగా ఉండిపోయింది. గౌరీ ఖాన్ బ‌ర్త్‌డేకి సెల‌బ్రేష‌న్స్ అనేవి లేకుండా పోయాయి. కార‌ణం వారి కొడుకు ఆర్య‌న్ ఖాన్ బెయిల్ పిటిష‌న్‌ను ఇదే రోజు కోర్టు తిర‌స్క‌రించింది. దాంతో ఆర్య‌న్‌ను ముంబైలోని ఆర్థ‌ర్ రోడ్ జైలులోనే ఉండాల్సిన ప‌రిస్థితి. ఆర్య‌న్‌కు బెయిల్ రాలేద‌ని తెలిసి గౌరీ ఖాన్ ప‌డుతున్న ఆవేద‌న మామూలుగా లేద‌ని వారి స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

అక్టోబ‌ర్ 2న ముంబై నుంచి గోవాకు బ‌య‌లుదేరిన క్రూయిజ్ షిప్‌లో జ‌రుగుతున్న రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) టీమ్ దాడిచేసి ఆర్య‌న్ ఖాన్‌తో పాటు మ‌రికొంత‌మందిని అరెస్ట్ చేసింది. అప్ప‌ట్నుంచీ ఆర్య‌న్ ఎన్సీబీ క‌స్ట‌డీలో ఉన్నాడు. గురువారం ముంబై కోర్టులో ఆర్య‌న్ హాజ‌రు కాగా, కోర్టు అత‌డికి జుడిసియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. శుక్ర‌వారం అత‌డి బెయిల్ పిటిష‌న్‌ను కోర్టు తిర‌స్క‌రించింది.

గౌరీ ఖాన్ 51వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సుజానే ఖాన్‌, ఫ‌రా ఖాన్ లాంటి కొంత‌మంది బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. కానీ వాటిని స్వీక‌రించే స్థితిలో గౌరి లేరు. ఆర్య‌న్‌కు బెయిల్ ల‌భించిన‌ట్ల‌యితే క‌చ్చితంగా అది గౌరీకి బ‌ర్త్‌డే గిఫ్ట్ అయివుండేది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.