English | Telugu

కృతి తాజా చిత్రానికి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ బ‌ర్త్ డే స్పెష‌ల్ గా ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన `మిమి`.. న‌టిగా త‌న‌కు ఎన‌లేని గుర్తింపుని తీసుకువ‌చ్చింది. ఇందులో టైటిల్ రోల్ లో త‌న‌దైన అభిన‌యంతో మెస్మ‌రైజ్ చేసింది కృతి. క‌ట్ చేస్తే.. కృతి త‌దుప‌రి చిత్రం `హ‌మ్ దో హ‌మారా దో` కూడా మ‌రో ఓటీటీ వేదిక డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోంద‌ని రీసెంట్ గా ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 29న `హ‌మ్ దో హ‌మారా దో`ని స్ట్రీమ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

అభిషేక్ జైన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాని దినేజ్ విజ‌న్ నిర్మించారు. ఇందులో కృతి తో పాటు రాజ్ కుమార్ రావ్, ప‌రేశ్ రావెల్, ర‌త్నా పాఠ‌క్ షా ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. త‌న పెళ్ళి కోసం త‌ల్లిదండ్రుల్ని ద‌త్త‌త తీసుకున్న ఓ యువ‌కుడి క‌థ‌గా `హమ్ దో హ‌మారా దో` తెర‌కెక్కింది. మ‌రి.. దీపావ‌ళి స్పెష‌ల్ గా స్ట్రీమ్ కానున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్.. వీక్ష‌కుల‌ను ఏ స్థాయిలో అల‌రిస్తుందో చూడాలి. అలాగే, కృతి ఖాతాలో మ‌రో ఓటీటీ హిట్ చేరుతుందా? లేదా? అన్న‌ది కూడా ఆస‌క్తిక‌ర‌మే.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.