English | Telugu

రేవ‌తి డైరెక్షన్ లో కాజోల్!

నిన్న‌టి త‌రం అగ్ర క‌థానాయిక రేవ‌తి మంచి న‌టీమ‌ణి మాత్ర‌మే కాదు.. మంచి ద‌ర్శ‌కురాలు కూడా. `మిత్ర్ - మై ఫ్రెండ్` (భార‌తీయ ఆంగ్ల చిత్రం), `ఫిర్ మిలేంగే` (హిందీ), `కేర‌ళ కేఫ్` (మ‌ల‌యాళం `ఆంథాల‌జీ` ఫిల్మ్ - ఇందులో `మ‌గ‌ళ్` అనే సెగ్మంట్ ని డైరెక్ట్ చేశారు), `ముంబ‌యి క‌టింగ్` (హిందీ `ఆంథాల‌జీ` ఫిల్మ్ - ఇందులో `పార్సెల్` అనే సెగ్మంట్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు).. ఇలా మొత్తంగా నాలుగుసార్లు మెగాఫోన్ ప‌ట్టారు రేవ‌తి. వీటిలో `మిత్ర్`.. మూడు జాతీయ పుర‌స్కారాల‌ను ద‌క్కించుకోవ‌డం విశేషం.

ఇదిలా ఉంటే.. సుదీర్ఘ విరామం అనంత‌రం రేవ‌తి మ‌రోమారు `రోల్, కెమెరా, యాక్ష‌న్, క‌ట్` అంటూ సెట్స్ లో కెప్టెన్ గా సంద‌డి చేయ‌నున్నారు. `ది లాస్ట్ హురై` పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ హిందీ చిత్రంలో ఎవ‌ర్ గ్రీన్ హీరోయిన్ కాజోల్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించ‌బోతున్నారు. సుజాత అనే ఓ మ‌హిళ త‌న‌ జీవితంలో ఎలాంటి స‌వాళ్ళు ఎదుర్కొంది? అనే క‌థాంశంతో `ది లాస్ట్ హురై` రూపొంద‌నుంది. మ‌న‌సుల్ని క‌దిలించే ఈ చిత్రంలో కాజోల్ న‌ట‌న ప్ర‌ధాన బ‌లం కానుంద‌ని.. త్వ‌ర‌లోనే ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ప‌ట్టాలెక్క‌నుంద‌ని బాలీవుడ్ స‌మాచారం. మ‌రి.. కాజోల్, రేవ‌తి ఫ‌స్ట్ కాంబినేష‌న్ లో రాబోతున్న `ది లాస్ట్ హురై` ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.