Read more!

English | Telugu

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయ‌సి!

 

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయ‌సి, టీవీ న‌టి అంకితా లోఖండే త‌న చిర‌కాల స్నేహితుడు విక్కీ జైన్‌ను పెళ్లాడేందుకు రెడీ అవుతోంది. అంకిత జీవితంలో క‌ష్టాలు ఎదుర్కొంటున్న‌ప్పుడు ఆమెకు తోడుగా ఉండి, ధైర్యాన్నిచ్చింది విక్కీనే. ఆ క్ర‌మంలో స్నేహితుల నుంచి ప్రేమికులుగా మారారు. త‌ర‌చూ అంకిత త‌న ప్రేమ జీవితానికి సంబంధించిన మూమెంట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తూ వ‌స్తోంది.

అంకిత‌, విక్కీ పెళ్లి ప‌నులు మెహందీ వేడుక‌తో మొద‌ల‌య్యాయి. త‌న కాబోయే అత్త‌గారు, ఆడ‌బిడ్డ‌తో అంకిత దిగిన ఫొటో ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారింది. త‌న మెట్టినింటివారితో అంకిత అనుబంధం ఎలాంటిదో కూడా ఆ పిక్చ‌ర్ తెలియ‌జేసింది. డిసెంబ‌ర్ 12న ముంబైలో గ్రాండ్‌గా జ‌రిగిన వేడుక‌లో అంకిత‌, విక్కీ ఎంగేజ్‌మెంట్ క‌న్నుల‌పండువ‌గా జ‌రిగింది. దీనికి సంబంధించిన బ‌య‌ట‌కు వ‌చ్చిన వీడియోలో, ఆ ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు పొగుడుకోవ‌డం చూడొచ్చు.
ఈ ఎంగేజ్‌మెంట్ డిస్కో థీమ్‌తో జ‌రిగింది.

Also read:  అంగరంగ వైభవంగా కత్రినా, విక్కీ కౌశల్ వివాహం

ఆదివారం అంకిత‌, విక్కీ ఒక గ్రాండ్ మెహందీ పార్టీ ఇచ్చారు. ఈ వేడుక‌లో పింక్ ఫ్లోర‌ల్ లెహంగాలో మెరిసిపోయింది అంకిత‌. ఆమె నుంచి చూపు తిప్పుకోవ‌డం అతిథుల‌కు క‌ష్ట‌మైపోయింది.

Also read:  షాహిద్ క‌పూర్ పేరుతో విసిగిపోయిన‌ విద్యా బాల‌న్‌!

టీవీలో ప‌నిచేసేట‌ప్పుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, అంకిత ప్రేమ‌లో ప‌డ్డారు. కొన్నేళ్ల త‌ర్వాత విడిపోయారు. ఆ త‌ర్వాత రియా చ‌క్ర‌వ‌ర్తితో సుశాంత్ డేటింగ్ చేయ‌గా, విక్కీ జైన్‌తో ప్రేమ‌లో ప‌డింది అంకిత‌.