అంగరంగ వైభవంగా కత్రినా, విక్కీ కౌశల్ వివాహం
on Dec 10, 2021
.webp)
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. రాజస్తాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో గురువారం వీరి వివాహం ఘనంగా జరిగింది.
Also Read: కత్రినా-విక్కీ రాయల్ వెడ్డింగ్ వెనుక ఉన్న బ్యాచ్ ఇదే!
కత్రినా-విక్కీ వెడ్డింగ్ వేడుకలు డిసెంబర్ 7న ప్రారంభమయ్యాయి. పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్ ఘనంగా జరిగాయి. గురువారం వివాహం జరిగింది. వివాహ తంతు జరుగుతున్న సమయంలో కత్రిన భావోద్వేగానికి గురైంది. ప్రేమించిన వాడిని జీవిత భాగస్వామిగా పొందుతున్న సంతోషాన్ని.. ఆమె ఆనందభాష్పాల రూపంలో కళ్ళలో చూపించింది. వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పెళ్లి దుస్తుల్లో ఇద్దరు మెరిసిపోతూ.. మేడ్ ఫర్ ఇచ్ అదర్ లా ఉన్నారు.

Also read: కత్రినా-విక్కీ వెడ్డింగ్ ఫుటేజ్‌కు రూ. 100 కోట్ల ఆఫర్ చేసిన ఓటీటీ దిగ్గజం!
కత్రినా-విక్కీ వివాహ వేడుకకు మీడియాను అనుమతించలేదు. వీరి వివాహ ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ రూ.100 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి వివాహ వేడుక ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



