Read more!

English | Telugu

ఇంట‌ర్నేష‌న‌ల్ వెబ్‌సీరీస్ రెన్నెర్వేష‌న్స్ లో అనిల్ క‌పూర్‌!

ఇంట‌ర్నేష‌న‌ల్ వెబ్‌సీరీస్ రెన్నెర్వేష‌న్స్‌లో న‌టించ‌డానికి ఓకే  చెప్పేశారు అనిల్ క‌పూర్‌. ఈ కొత్త వెబ్‌సీరీస్‌లో అవ‌తార్ ఆర్టిస్ట్ జెరెమి రెన్నెర్ న‌టించ‌నున్నారు. ఈ వెబ్‌సీరీస్ గురించి గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వైర‌ల్ అవుతున్న నేప‌థ్యంలో వాటిని ధ్రువీక‌రించారు అనిల్ క‌పూర్‌.

ఆయ‌న న‌టించిన ఓటీటీ సీరీస్ ది నైట్ మేనేజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లైంది. అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. 1987లో శేఖ‌ర్ క‌పూర్‌తో మిస్ట‌ర్ ఇండియాలో ప‌నిచేశారు అనిల్‌. అప్ప‌టి నుంచీ వీరిమ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ది నైట్‌మేనేజ‌ర్ చూసిన శేఖ‌ర్ క‌పూర్ అనిల్‌ని ప‌రిప‌రివిధాలా ప్ర‌శంసించారు. అనిల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాజెక్ట్ గురించి కూడా ప్ర‌స్తావించారు. ఆయ‌న ట్వీట్‌కు స‌మాధానం ఇస్తూ ప్రాజెక్ట్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేశారు అనిల్‌క‌పూర్‌.

అనిల్ క‌పూర్, జెరెమి రెన్నెర్ గ‌తేడాది రాజ‌స్థాన్‌లో క‌లిసి క‌నిపించిన‌ప్పుడు వారిరువురూ క‌లిసి ఓ ప్రాజెక్ట్ లో న‌టిస్తారంటూ అంత‌ర్జాతీయ ప‌త్రిక‌లు రాశాయి. అయితే వాటి గురించి అప్ప‌ట్లో ఎవ‌రూ ధ్రువీక‌రించ‌లేదు.ఇప్పుడు అనిల్ ట్వీట్‌తో అంద‌రూ ఈ ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు.బ్రిటిష్ హిట్ సీరీస్ ది నైట్ మేనేజ‌ర్ ఇండియ‌న్ వెర్ష‌న్‌లో అనిల్ క‌పూర్ బిజినెస్‌మ్యాన్‌గా క‌నిపించారు. ఈ సీరీస్‌లో అనిల్ క‌పూర్‌తో పాటు ఆదిత్య‌రాయ్ క‌పూర్‌, శోభిత ధూళిపాళ కు కూడా మంచి పేరు వ‌స్తోంది.సినిమాల్లో న‌టించే హీరో టీవీల్లోనూ, ఓటీటీల్లోనూ న‌టిస్తే మార్కెట్ ప‌డిపోతుంద‌ని, అవ‌కాశాలు రాక‌నే ఇలా చేస్తున్నార‌ని ప్ర‌జ‌లు భావిస్తార‌ని గతంలో రాంగ్ నోష‌న్ ఉండేద‌ని గుర్తుచేసుకున్నారు అనిల్‌.

మాధ్య‌మం ఏదైనా ప్ర‌జ‌ల‌కు వినోదాన్ని అందించ‌డ‌మే న‌టుడి క‌ర్త‌వ్య‌మ‌ని, ఇప్పుడు ఇండియాలోనూ న‌టీన‌టులు ఈ ద‌శ‌గా ఆలోచిస్తుండ‌టం ఆనందంగా ఉంద‌ని అన్నారు. ప్ర‌తి క‌థ‌నూ సిల్వ‌ర్ స్క్రీన్ మీద చెప్ప‌డం సాధ్యం కాద‌ని, అలాంటివాటిని బుల్లితెర‌మీద‌, ఓటీటీల్లో చెప్ప‌డం స‌బ‌బు అని అన్నారు మిస్ట‌ర్ ఇండియా. భ‌విష్య‌త్తులోనూ మంచి ప్ర‌యోగాలు చేయ‌డానికి తాను సిద్ధ‌మేన‌ని వెల్ల‌డించారు.