Read more!

English | Telugu

ఆమెతో కార్తిక్‌... ఉద‌య్‌పూర్‌లో ఏం చేస్తున్నారు?

బాలీవుడ్ రూమ‌ర్డ్ క‌పుల్ కార్తిక్ ఆర్య‌న్‌, సారా అలీఖాన్ మ‌రోసారి వార్త‌ల్లోకెక్కారు. వారిద్ద‌రూ క‌లిసి ఉద‌య్‌పూర్‌లో చిరున‌వ్వులు చిందిస్తూ మాట్లాడుకుంటున్న ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఉద‌య్‌పూర్‌కి వెళ్తున్న‌ట్టు కార్తిక్ త‌న ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. సారా కూడా ట్రిప్ గురించి పోస్ట్ చేశారు. అయితే ఇద్ద‌రూ క‌లిసి వెళ్తున్న సంగ‌తి మాత్రం ఆ పోస్టుల్లో లేదు. తీరా అక్క‌డ వారిద్ద‌రూ క‌లిసి ఉన్న ఫొటోలు వైర‌ల్ అవుతున్న‌ప్పుడు వీటి గురించి క్యూట్‌గా స్పందిస్తున్నారు. కార్తిక్ ఆర్య‌న్ మాట్లాడుతూ ``ఒకే చోటికి వెళ్లాం. అక్క‌డికి చాలా మంది వ‌స్తుంటారు. చాలా ఫొటోలు తీసుకుంటుంటారు. మా ఇద్ద‌రి ఫొటో తీయ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపించింది`` అని అన్నారు. కార్తిక్‌, సారా క‌లిసి ల‌వ్ ఆజ్‌క‌ల్2 లో న‌టించారు. ఈ సినిమా త‌ర్వాత వారిద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నార‌ని వార్త‌లొచ్చాయి. అయితే 2020లో వారిద్ద‌రూ విడిపోయార‌ని అన్నారు. ఆ త‌ర్వాత వారి గురించి పెద్ద‌గా ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌లేదు. అయితే క‌ర‌ణ్‌జోహార్ మాత్రం వారిద్ద‌రి రిలేష‌న్‌షిప్ గురించి హింట్ ఇచ్చారు. ఇప్ప‌టిదాకా కార్తిక్ ఆర్య‌న్‌గానీ, సారా అలీఖాన్ గానీ త‌మ రిలేష‌న్ షిప్ గురించి ఎక్క‌డా మాట్లాడ‌లేదు.

అయితే రీసెంట్‌గా వీరిద్ద‌రూ క‌లిసి మ‌ళ్లీ ఉద‌య్‌పూర్‌లో క‌నిపించేస‌రికి, బ్రేక‌ప్ జ‌ర‌గ‌లేదా?  లేకుంటే మ‌ళ్లీ క‌లిశారా? క‌లిసే ఉద‌య్‌పూర్ వెళ్లారా? అక్క‌డ యాదృచ్చికంగా క‌లిశారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇద్ద‌రూ బ్రైట్ స్మైల్స్ తో న‌వ్వుతున్న ఫొటోలు చూస్తుంటే, ప్లాన్డ్ ట్రిప్పేన‌ని అంటున్నారు నెటిజ‌న్లు. కార్తిక్‌, సారా క‌లిసి ఓ సినిమాలో న‌టించ‌బోతున్నార‌నే వార్త‌లు కూడా ఉన్నాయి. దాని గురించి కార్తిక్ మాట్లాడుతూ ``ఇప్ప‌టిదాకా అలాంటిదేమీ లేదు. మా ఇద్ద‌రితో ఎవ‌రూ సినిమాను కూడా అనౌన్స్ చేయ‌లేదు. ఒక‌వేళ చేశారేమో, నా వ‌ర‌కైతే  విష‌యం రాలేదు`` అంటూ చ‌మ‌త్క‌రించారు. కార్తిక్ ఆర్య‌న్ న‌టించిన రీసెంట్ ఫిల్మ్ షెహ్‌జాదా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా ఆడ‌లేదు. తెలుగులో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమాకు రీమేక్ ఇది.