English | Telugu
ఆలియాని కాకా పడుతున్న అనన్య
Updated : Aug 16, 2023
ఆలియాభట్ కుమార్తె రహా కపూర్‌ని అదే పనిగా పొగుడుతున్నారు అనన్య పాండే. ఇప్పటికే రహా కపూర్ మీద అందరి దృష్టీ ఉంది. ఏ చిన్న విషయం తెలుస్తుందా, సెలబ్రేట్ చేసుకుందామా అని వెయిట్ చేస్తున్నారు రణ్‌బీర్ కపూర్, ఆలియా ఫ్యాన్స్. అలాంటివారందరికీ, అనన్య చెబుతున్న మాటలు భలే పసందుగా అనిపిస్తున్నాయి. అనన్య పాండే ఇప్పుడు డ్రీమ్ గర్ల్ 2 ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగానే ఆమె రహా కపూర్ గురించి క్యూట్ విషయాలను పంచుకున్నారు.
అనన్య మాట్లాడుతూ ``ఆలియాకి చాలా అందమైన పాప ఉంది. రహాని చూస్తుంటే, ఎంంత సేపైనా చూడబుద్ధేస్తుంది. ఆలియా భట్‌ని చూసి రహానీ చూస్తే యాజ్ ఇట్ ఈజ్‌గా అవే పోలికలు కనిపిస్తాయి. ఆలియాను చిన్నప్పుడు చూడటం మిస్ అయిన వారందరూ ఇప్పుడు రహాకపూర్‌ని చూస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని రణ్‌బీర్ కూడా అంగీకరించారు. ఆలియాకి కార్బన్ కాపీలా ఉందంటూ కితాబిచ్చేశారు`` అని అన్నారు. గతేడాది ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు ఆలియా - రణ్‌బీర్. నవంబర్ 6 వారికి రహా పుట్టింది. అనన్య పాండే ప్రస్తుతం డ్రీమ్ గర్ల్ 2 ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ సినిమాలో పూజా అనే లేడీ గెటప్‌లో కనిపిస్తారు ఆయుష్మాన్ ఖురానా. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించారు. అభిషేక్ బెనర్జీ, పరేష్ రావల్, విజయ్ రాజ్, మనోజ్ సింగ్, రాజ్‌పాల్ యాదవ్, సీమా పహ్వా, మనోజ్ జోషి, అన్ను కపూర్, అస్రానీ కీలక పాత్రల్లో నటించిన సినిమా డ్రీమ్ గర్ల్ 2.