English | Telugu

లేడీ స్పై మూవీలో ఏజెంట్ ఆలియా!

నిన్న మొన్నటి దాకా స్పై ఫిలింస్ కేవలం హీరోలకు మాత్రమే సంబంధించినవి అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఫీలింగ్‌లో చేంజ్ రాబోతోంది. ఆదిత్య చోప్రా అందుకు ఆల్రెడీ ప్లాన్ వేశారు. ఆలియా భట్ తో స్పై సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. య‌ష్‌రాజ్‌ ఫిలిమ్స్ ఫస్ట్ ఫిమేల్ మూవీని తెర‌కెక్కించ‌డానికి రెడీ అవుతోంది. 20204 లో ఈ సినిమాను స్క్రీన్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2012 నుంచి స్పై సినిమాలు తీస్తోంది య‌ష్‌రాజ్ ఫిల్మ్స్. ఏక్తా టైగర్ తో ఈ ఒరవడి మొదలైంది. టైగర్ జిందా హై, వార్, పఠాన్ సినిమాలతో కంటిన్యూ చేస్తోంది. ఈ నాలుగు సినిమాలు హైయెస్ట్ గ్రాసింగ్ హిందీ సినిమాలుగా రికార్డు సాధించాయి. ఈ యూనివర్స్ ని ఎక్స్‌ప్యాండ్‌ చేసే ఉద్దేశంలో ఉన్నారు ఆదిత్య చోప్రా. అందుకే ఆలియా భట్ ప్రధాన పాత్రలో బిగ్ బడ్జెట్ యాక్షన్ స్పెక్ట‌కిల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫిమేల్స్ స్పైగా ఆలియా భట్ ద బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తారన్నది ఆదిత్య చోప్రా న‌మ్మ‌కం. ఆలియా భట్ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ లో ఒకరు. అందుకే స్పై యూనివర్స్ లో ఇప్పటిదాకా ప్రూవ్ చేసుకున్న సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్ తో పాటు ఈమె పేరును కూడా శాశ్వతంగా వినిపించేలా చేస్తామంటున్నారు ఆదిత్య చోప్రా. అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ మూవీగా తెర‌కెక్కించ‌నున్నారు.

అలియా భట్ ఇంతకుముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో కనిపిస్తారని అంటుంది నార్త్ మీడియా. ఈ యూనివర్స్‌లో ఆలియాకు అత్యద్భుతమైన క్యారెక్టర్ ని డిజైన్ చేశారు ఆదిత్య చోప్రా.s ఆమెతో వరుసగా ఫ్రాంఛైజీలు తీయాలన్నది ఆయన ప్లాన్. ఇంకా ఈ సినిమాకు పేరు అనుకోలేదు. కానీ, భారీ స్థాయిలో తెరకెక్కించాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఏక్తా టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ త్రీ, వార్‌2, టైగర్ వర్సెస్ పఠాన్ ఇప్పటికే జనాలకి తెలిసిన సినిమాలు. కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ త్రీని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వార్‌2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కీ రోల్స్ చేస్తున్నారు. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్లో ఫ్లోర్స్ కి వెళ్ళనుంది. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ తో టైగర్ వర్సెస్ ప‌ఠాన్‌ స్క్రీన్ మీదకి వెళ్లనుంది. వచ్చే రెండేళ్లలో నాలుగు స్పై సినిమాలను విడుదల చేయాలన్నది యష్‌ రాజ్ ఫిల్మ్స్‌ ప్లాన్. అనూహ్యమైన రీతిలో కలెక్షన్లు కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు ఆదిత్య చోప్రా.