English | Telugu

ఆయుష్మాన్ ఖురానా మ్యూజిక్ జ‌ర్నీ

బాలీవుడ్‌లో మ‌ల్టీ టాలెంటెడ్ న‌టుల్లో ఆయుష్మాన్ ఖురానా ఒక‌రు. నియ‌ర్ ఫ్యూచ‌ర్‌లో సంగీతంపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ప‌లు పాట‌లు పాడారు ఆయుష్మాన్‌. నియ‌ర్ ఫ్యూచ‌ర్‌లో మ‌రిన్ని ఆల్బ‌మ్స్ చేయాల‌నుకుంటున్నారు. ఈ జ‌ర్నీ గురించి ఆయుష్మాన్ మాట్లాడుతూ `` మ్యూజిక్ ఆల్బ‌మ్స్ చేయ‌డం అంత తేలికైన ప‌ని కాదు. చాలా డిసిప్లిన్‌గా ఉండాలి. గ‌త రెండు, మూడు రోజులుగా నేను క‌నీసం రెండు, మూడు చిత్రాల‌ను రిలీజ్ చేస్తున్నాను. ఇక‌పై ఏడాదికి రెండు సినిమాలు మాత్ర‌మే చేయాల‌ని భావిస్తున్నాను. మంచి సంగీతాన్ని చేయాల‌ని నా ఇష్టం. ఇక‌పై ఎక్కువగా సింగిల్స్ చేయాల‌నుకుంటున్నాను`` అని అన్నారు.

ఆయుష్మాన్ ప్ర‌స్తుతం డ్రీమ్ గ‌ర్ల్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ఆయ‌న క‌ర‌మ్‌వీర్ సింగ్ అనే పాత్ర‌ను పోషిస్తున్నారు. ఈ ఫ్రాంఛైజీలో తొలి సినిమాలో ఆయ‌న కాల్ సెంట‌ర్‌లో పూజ అనే లేడీలాగా న‌టించారు. 2019 చిత్రానికి సీక్వెల్ ఇది. అన‌న్య పాండే ఇందులో నాయిక‌గా న‌టించారు. ఈ సినిమా ఇంకో రేంజ్‌లో హిట్ అవుతుంద‌నే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఆయుష్మాన్‌. sఆయుష్మాన్ సెల‌క్ట్ చేసుకునే స‌బ్జెక్టుల ప‌ట్ల యువ‌త‌కు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఆయుష్మాన్ సినిమా చేశారంటే, త‌ప్ప‌కుండా ఆ క‌థ‌లో ఏదో స్పెషాలిటీ ఉండి తీరుతుంద‌ని న‌మ్ముతున్నారు అభిమానులు.