Read more!

English | Telugu

'ఓ మై గాడ్‌ 2'.. శివుడిగా అక్షయ్‌ లుక్‌ అదిరింది!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, పరేశ్‌ రావెల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఓ మై గాడ్'. ఉమేష్ శుక్లా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2012లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 'గోపాల గోపాల' పేరుతో తెలుగులో రీమేక్ కాగా.. ఇందులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడు 'ఓ మై గాడ్' సినిమాకి సిక్వెల్‌ రానుంది. తాజాగా 'ఓ మై గాడ్‌ 2' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి.

'ఓ మై గాడ్'లో కృష్ణుడిగా కనిపించి మెప్పించిన అక్షయ్.. 'ఓ మై గాడ్‌ 2'లో శివుడిగా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు అక్షయ్. ఈ పోస్టర్ లో శివుడిగా అక్షయ్ లుక్ ఆకట్టుకుంటోంది. అలాగే పోస్టర్ లో స్కూల్ పిల్లోడు బ్యాగ్ తగిలించుకొని కూర్చొని సాయం కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన అక్షయ్.. మరో సోషల్‌ ఇష్యూతో మీ ముందుకు రాబోతున్నామని.. 'ఓ మై గాడ్‌ 2'కి మీ అందరి ఆశీర్వాదాలు, ఆదరణ కావాలని ట్వీట్ చేశాడు.

'ఓ మై గాడ్‌ 2'లో అక్షయ్‌ కుమార్‌, పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అశ్విన్‌ వర్డే, అక్షయ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి అమిత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.