English | Telugu
మార్క్ ఆంటోనీ డైరక్టర్‌కి అజిత్ గ్రీన్ సిగ్నల్?
Updated : Oct 12, 2023
మార్క్ ఆంటోనీ సినిమా డైరక్టర్ ఆదిక్ రవి చంద్రన్. ఈ డైరక్టర్‌కి అజిత్ కుమార్ కాల్షీట్ ఇచ్చేశారన్నది చెన్నైలో వైరల్ అవుతున్న న్యూస్. అజిత్ కుమార్ ప్రస్తుతం విడాముయర్చి సినిమా షూటింగ్‌లో ఉన్నారు. మార్క్ ఆంటోనీ డైరక్టర్ ఆదిక్ రవి చంద్రన్ కాల్షీట్ ఇచ్చారన్నది ఇప్పటిదాకా ఎక్కడా అఫిషియల్‌గా రాలేదు. కానీ చెన్నై బేస్డ్ యూట్యూబ్ చాన్సెల్స్ లో మాత్రం ఈ వార్త హోరెత్తుతోంది. ఎల్రెడ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తారనే టాక్ కూడా ఉంది. ఆర్ ఎస్ ఇన్‌ఫోటైన్‌మెంట్ పతాకంపై ఈ సినిమాను రూపొందిస్తారట. ఇంతకు పూర్వం విడుదలై పార్ట్ ఒన్‌ని కూడా ఆర్ ఎస్ ఇన్‌ఫో టైన్‌మెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఇప్పుడు విడుదలై పార్ట్ 2 ని తెరకెక్కిస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూరి, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్నారు.
అజిత్ కుమార్, ఆదిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో మూవీ అనే మాటను ఇదివరకు ఎవరూ ఊహించలేదు. కానీ ఇటీవల ఆదిక్ రవిచంద్రన్ వెళ్లి అజిత్‌ని కలిశారట. కథ కూడా చెప్పారట. ముందు పాయింట్‌గా చెప్పారట. ఆ తర్వాత పాయింట్ నచ్చడంతో ఎలాబరేట్‌గా చెప్పారని న్యూస్. మార్క్ ఆంటోనీ సినిమాకు తమిళనాడులో మంచి మార్కులే పడ్డాయి. థియేటర్లలోనే పాతిక రోజులు ఆడింది ఈ సినిమా. విశాల్, ఎస్.జె.సూర్య పెర్ఫార్మెన్సులకు మంచి మార్కులు పడ్డాయి. వింటేజ్ సాంగ్స్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ వంటివి యాక్షన్ కామెడీకి ప్లస్ అయ్యాయి. ఆదిక్ ఇంతకు పూర్వం త్రిష ఇల్లన్న నయనతార, అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్, భగీరా వంటి సినిమాలు చేశారు. గతంలో అజిత్ నటించిన నెర్కొండపార్వైలో యాక్టర్‌గానూ చేశారు ఆదిక్ రవిచంద్రన్. అప్పటి నుంచే అజిత్‌తో ఉన్న పరిచయంతో ఇప్పుడు కథ వినిపించారన్నది టాక్.