English | Telugu
గూగుల్‌పై 4 కోట్లకు దావా వేసిన ఐశ్వర్యరాయ్.. ఆ వీడియోలే దానికి కారణం!
Updated : Oct 2, 2025
సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరగడం వల్ల సొసైటీకి జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ కనిపిస్తోంది. ఇటీవలికాలంలో ఎఐ చేస్తున్న మాయాజాలం అంతా కాదు. దాని కోసం కొందరు సెలబ్రిటీలను వాడుకొని వారితో విచిత్ర విన్యాసాలు చేయిస్తున్నారు. వారిలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ వంటి తారలు కూడా ఉన్నారు. వీరికి సంబంధించిన ఎఐ వీడియోలు చాలా అందుబాటులో వున్నాయి.
ఒక నటిని అకస్మాత్తుగా ముద్దు పెట్టుకున్న అభిషేక్ క్లిప్
బ్యాక్‌గ్రౌండ్‌లో అభిషేక్ సిగరెట్ కాలుస్తుండగా, ఐశ్వర్యరాయ్, ఆమె మాజీ ప్రియుడు సల్మాన్‌ఖాన్ కలిసి భోజనం చేస్తున్న వీడియో
అభిషేక్‌ను మొసలి వెంబడిస్తున్నప్పుడు సల్మాన్‌ఖాన్‌ను అతన్ని రక్షించే ప్రయత్నం చెయ్యడం..
ఇలాంటి వీడియోలు అనేకం ఉన్నాయి. సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు, వారి వాయిస్‌లను దుర్వినియోగం చేస్తున్న వారిని కోర్టు ముందు నిలబెట్టే హక్కువ చట్టం ఇచ్చింది. ఎఐ వల్ల బాధింపబడిన వారికి చట్టం అండగా ఉంటోంది. ఈ తరహా కేసులలో విజయం సాధించిన మొదటి భారతీయ జంటగా ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు సంచలనం సృష్టిస్తున్నారు. దాదాపు 1500 పేజీల రిపోర్ట్‌ని వీరి లాయర్లు కోర్టుకు సమర్పించారు. ఇందులో వందలాది ఇమేజ్ క్లిప్ లు, వీడియోలను కూడా జోడించారు. వాటన్నిటినీ న్యాయమూర్తులు పరిశీలించి సెలబ్రిటీ దంపతులకు జరుగుతున్న నష్టాన్ని ఒక అంచనా వేసి చివరిగా తీర్పును వెలువరించారు.
ఇప్పుడు ఈ తప్పులన్నిటికీ మూలమైన గూగుల్ పైనా, గూగుల్, యూట్యూబ్, వెబ్ వేదికలుగా ఈ కార్యకలాపాలకు కారకులైన వారిపైనా అభిషేక్, ఐశ్వర్యారాయ్ దంపతులు వరుసగా పరువు నష్టం దావాలు వేస్తున్నారు. అంతే కాదు, అనధికారికంగా వస్తువులపై తమ ఫోటోలను ఉపయోగించిన వారిపైనా కేసులు వేసారు. పోస్టర్లు, కాఫీ మగ్‌లు, తమ ఫోటోలతో కూడిన స్టిక్కర్లు, నకిలీ ఆటోగ్రాఫ్ ఫోటోలను విక్రయించే వారి నుంచి పరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు. గూగుల్ సహా ఇతరులపై 4 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని, ఆయా వస్తువులను శాశ్వతంగా నిషేధాన్ని కూడా కోరుతున్నారు. ఇలాంటి కంటెంట్‌ను చూపించే యూట్యూబ్ వీడియోలకు సంబంధించి వందలాది లింక్‌లు, స్క్రీన్‌షాట్‌లను కూడా న్యాయమూర్తులకు అభిషేక్, ఐష్ జంట సమర్పించింది. వైరల్ అయిన 518 వెబ్‌సైట్ లింక్‌లు, పోస్ట్‌లను తొలగించాలని కోర్టు జడ్జి ఇప్పటికే ఆదేశించారు.