Read more!

English | Telugu

అభిషేక్‌, ఐశర్య విడాకుల ఎపిసోడ్‌లో పెద్ద ట్విస్ట్‌.. ఏమిటది?

సినిమా తారల వ్యక్తిగత విషయాల గురించి వినేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. అది వారి ప్రేమ కావచ్చు, పెళ్లి కావచ్చు. అందులోనూ ఏ సినిమా జంటయినా విడాకులు తీసుకుంటోంది అంటే ఇక మీడియాలో రచ్చే జరుగుతుంది. సంసార జీవితంలో ఒడిదుడుకులు, అభిప్రాయ భేదాలు రావడం ఎంతో సహజం. సాధారణంగా ఏ జంటకైనా ఎదురయ్యే అనుభవాలు ఇవి. కానీ, సెలబ్రిటీస్‌ విషయంలో ఇలాంటివి జరిగితే అది పెద్ద సెన్సేషన్‌ అయిపోవడం మనం చూస్తున్నాం. సినిమా తారల విషయంలో ఏ చిన్న ఆధారం దొరికినా గోరంతను కొండంత చేసి ప్రచారం చేయడం పరిపాటి అయిపోయింది. మీడియా విస్తరించడం, దానికి సోషల్‌ మీడియా కూడా తోడవడంతో చీమ చిటుక్కుమన్నా.. దాన్ని ఓ ఆటంబాంబు పేలింది అన్నంత రేంజ్‌లో ప్రచారం చేసేస్తున్నారు. 

తాజాగా అలాంటి ఘటనే బాలీవుడ్‌లో జరిగింది. అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ 17 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 12 సంవత్సరాల ఆరాధ్య అనే పాప కూడా ఉంది. ఆదర్శవంతమైన జంటగా అభిషేక్‌, ఐశ్వర్యలకు మంచి పేరు ఉంది. బచ్చన్‌ ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో ఒక గౌరవం ఉంది. దాన్ని కాపాడుతూ ఈ జంట తమ వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈమధ్యకాలంలో అభిషేక్‌, ఐశ్వర్య విడాకులు తీసుకోబోతున్నారంటూ రూమర్స్‌ బాగా వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌ వెనుక బలమైన కారణాలంటూ ఏమీ కనిపించలేదు. ఒక చిన్న రూమర్‌ వచ్చిందీ అంటే ఆ తర్వాత ఏ కారణం దొరుకుతుందా.. ఆ రూమర్‌ని మరింత బలంగా స్ప్రెడ్‌ చేయడం ఎలా అని ఆలోచిస్తున్న వారికి చిన్న క్లూ దొరికింది. అదేమిటంటే నవంబర్‌ 1 ఐశ్వర్యారాయ్‌ పుట్టినరోజు. అభిషేక్‌ ఆమెకు సోషల్‌ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఐశ్వర్య 50వ పుట్టినరోజు వేడుకకు బచ్చన్‌ ఫ్యామిలీకి సంబంధించి ఎవరూ హాజరు కాకపోవడంతో ఈ పుకారుకు మరింత బలం చేకూరింది. దీనికితోడు  రెండు సందర్భాల్లో అభిషేక్‌ తన వివాహ ఉంగరాన్ని ధరించకపోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు, అమితాబ్‌ బచ్చన్‌ తన ఇన్‌స్టాలో ఐశ్వర్యను అన్‌ఫాలో చేశారని మీడియాలో వార్తలు రావడంతో వారి కుటుంబంలో విభేదాలు ఉన్నాయన్న న్యూస్‌ బాగా స్ప్రెడ్‌ అయింది. కాగా, ఇటీవల ఐశ్వర్య తన కూతురుతో కలిసి పుట్టింటికి వచ్చేసిందనే వార్తతో అభిషేక్‌, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారని కన్‌ఫర్మ్‌ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. బచ్చన్‌ ఫ్యామిలీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. అమితాబ్‌ మనవడు అగస్త్య నందా నటించిన ‘ది ఆర్చీస్‌’ ప్రీమియర్‌ షోకు అభిషేక్‌, ఐశ్వర్య, ఆరాధ్య కలిసి హాజరయ్యారు. వారు రెడ్‌ కార్పెట్‌పై నవ్వులు చిందిస్తూ నడిచి రావడం చూస్తే మీడియాలో వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని అర్థమవుతుంది. అంతేకాదు అమితాబ్‌ బచ్చన్‌ తన కొడుకు, కోడలుతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో గత కొంతకాలం నుంచి సీరియల్‌గా వస్తున్న ‘అభిషేక్‌, ఐశ్వర్య విడాకులు’ ఎపిసోడ్‌కు శుభం కార్డు పడినట్టయింది.