Read more!

English | Telugu

ఎం.పి.గా పోటీ చేయనున్న కంగనా.. ఏ పార్టీ తరఫునో తెలుసా?

సినిమా రంగం నుంచి రాజకీయ రంగానికి వెళ్లడం అనేది సర్వ సాధారణమైన విషయం. గతంలో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు రాజకీయ రంగంలో తమ అధృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు సక్సెస్‌ అయ్యారు, మరికొందరు మధ్యలో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తాజాగా హీరోయిన్‌ కంగనా రనౌత్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్త చర్చనీయాంశంగా మారింది. సినిమాలతోనే కాదు, వివాదాలతో కూడా ఎంతో పాపులర్‌ అయిన కంగనా రాజకీయాల్లోకి వస్తుందని చాలా కాలం నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె పొలిటికల్‌ ఎంట్రీపై ఆల్‌ మోస్ట్‌ ఒక క్లారిటీ వచ్చింది. ఈ విషయంపై స్పందించిన ఆమె... శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. 

 

ఇటీవల గుజరాత్‌లోని ప్రఖ్యాత శ్రీకృష్ణాలయం ద్వారకాధీష్‌ను సందర్శించిన కంగనా రనౌత్‌... తన పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించారు. సుమారు ఆరువందల ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ సాధ్యమైందని.. ఇది కూడా బీజేపీ నేతృత్వంలోనే జరిగిందన్నారు.  ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కంగనా సమావేశమైంది. అనంతరం ఆమె తండ్రి సమావేశం వివరాల్ని తెలియజేస్తూ బిజెపికి మద్దతుగా కంగనా ఉంటుందని తెలియజేశారు. అంతేకాదు, 2024లో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి తరఫున కంగనా పోటీ చేయబోతోందని ఆయన ధృవీకరించారు.