Read more!

English | Telugu

ప‌త్ర‌లేఖ మెడ‌లో మూడుముళ్లు వేసిన రాజ్‌కుమార్‌!

 

దీర్ఘ కాల గాళ్‌ఫ్రెండ్ ప‌త్ర‌లేఖ మెడ‌లో సోమ‌వారం మూడు ముళ్లు వేశాడు బాలీవుడ్ యాక్ట‌ర్ రాజ్‌కుమార్ రావ్‌. ద‌శాబ్దం కాలం పైనుంచీ ప్రేమలో వున్న ఆ ఇద్ద‌రూ త‌మ కుటుంబ స‌భ్యులు, స‌న్నిహిత మిత్రుల స‌మ‌క్షంలో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా జ‌రిగిన వేడుక‌లో పెళ్లి చేసుకున్నారు. వారు న్యూ చండీగ‌ఢ్‌లోని ది ఒబెరాయ్ సుఖ్‌విలాస్ స్పా రిసార్ట్‌లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకున్నారు.

పెళ్లి ఫొటోల‌ను షేర్ చేసిన రాజ్‌కుమార్‌, "11 సంవ‌త్స‌రాల ప్రేమ‌, రొమాన్స్‌, ఫ్రెండ్‌షిప్‌, ఫ‌న్ త‌ర్వాత చివ‌ర‌కు ఈరోజు నాకు అన్నీ అయిన నా సోల్‌మేట్‌, నా బెస్ట్ ఫ్రెండ్‌, నా ఫ్యామిలీని పెళ్లాడాను. ఈరోజు నీ భ‌ర్త‌గా పిలిపించుకోవ‌డం కంటే గొప్ప సంతోషం నాకేదీ లేదు ప‌త్ర‌లేఖా." అని రాసుకొచ్చాడు. 

ప‌త్ర‌లేఖ సైతం రెండు ఫొటోల‌ను షేర్ చేసి, "ఈరోజు నాకు స‌ర్వ‌స్వం అయిన నా బాయ్‌ఫ్రెండ్‌, అన్నింట్లోనూ నా పార్ట‌న‌ర్‌, నా ఫ్యామిలీ, నా సోల్‌మేట్‌.. గ‌డ‌చిన 11 సంవ‌త్స‌రాలుగా నా బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లాడాను. నీ భార్య‌ను కావ‌డం కంటే గొప్ప ఫీలింగ్ మ‌రేదీ లేదు నాకు." అని రాసుకొచ్చింది.

పెళ్లిలో రాజ్‌కుమార్ రావ్ సంప్ర‌దాయానికి త‌గ్గ‌ట్లు ఆఫ్‌-వైట్ షేర్వాణీ, పింక్ దుప‌ట్టా ధ‌రించి, వాటికి మ్యాచ్ అయ్యే ట‌ర్బ‌న్ పెట్టుకున్నాడు. ప‌త్ర‌లేఖ అయితే ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయింది. గోల్డ్ క‌ల‌ర్ పూలు డిజైన్ చేసిన రెడ్ క‌ల‌ర్‌ లెహంగా ధ‌రించిందామె. ఆమె వేసుకున్న దుప‌ట్టాపై బెంగాలీ ప‌దాలు ఎంబ్రాయిడ‌రీ చేసివున్నాయి. వాటి అర్థం, "నా ప్రేమ మొత్తం నీకేన‌ని ప్ర‌మాణం చేస్తున్నాను."

న‌వంబ‌ర్ 13న జ‌రిగిన నిశ్చితార్ధం వేడుక‌తో పెళ్లి ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. మోకాలిపై కూర్చొని రాజ్‌కుమార్ ప్ర‌పోజ్ చేయ‌గా, ప‌త్ర‌లేఖ సైతం మోకాలిపై కూర్చొని అత‌నితో నిశ్చితార్ధం ఉంగ‌రాన్ని వేలికి తొడిగించుకున్న వీడియో ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయ్యింది.