Read more!

English | Telugu

ఆ ప్రొడ్యూస‌ర్ నా బ‌ట్ట‌లు తీసేయ‌మ‌ని ఫోర్స్ చేయ‌డంతో చ‌చ్చిపోవాల‌నుకున్నా!

 

బిగ్ బాస్ ఓటీటీలో ఉన్న‌ది చాలా త‌క్కువ కాల‌మైనా వీక్ష‌కుల దృష్టిని బాగా ఆక‌ట్టుకుంది న‌టి ఉర్ఫీ జావెద్‌. హౌస్ నుంచి ఎలిమినేష‌న్ పొందిన‌ ఫ‌స్ట్ కంటెస్టెంట్ ఆమే. కానీ హౌస్‌లో ఎక్కువ త‌మ‌దైన వాయిస్‌ను వినిపించిన వారిలో ఆమె ఒక‌రు. స‌మ‌యస్ఫూర్తితో కూడిన ఆమె ఫ్యాష‌న్ సెన్స్ ఎప్పుడూ క‌ళ్లు చెదిరింప‌జేసేది. ఒక ప్రొడ్యూస‌ర్ త‌న‌ను శృంగార స‌న్నివేశాల్లో న‌టింప‌జేయ‌డానికి బ‌ల‌వంత పెట్టిన‌ప్పుడు తాను చ‌నిపోవాల‌ని అనుకున్న‌ట్లు ఇటీవ‌ల ఆమె వెల్ల‌డించింది. 

ఇదంతా ఉర్ఫీ కెరీర్ ఆరంభంలో జ‌రిగింది. కెరీర్ తొలినాళ్ల‌లో చాలా క‌ష్టాలు ప‌డింది ఉర్ఫీ. ఆమె తొలి పారితోషికం రూ. 3 వేలు. మ‌రో ఆరుగురు అమ్మాయిల‌తో క‌లిసి పేయింగ్ గెస్ట్‌గా ఉంది. ఆఫ‌ర్ల విష‌యంలో ప‌లుమార్లు ఆమె తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. అయితే ఒక వెబ్ సిరీస్ త‌ర్వాత ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింది.

టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన సంద‌ర్భంగా, "నేను సెట్‌కు వెళ్లిన‌ప్పుడు నాకు ముందుగా ఆ సీన్ గురించి స‌మాచారం ఇవ్వ‌లేదు. సెట్‌లో మొద‌టి రోజు, ఆ ప్రొడ్యూస‌ర్ ఒక శృంగార స‌న్నివేశాన్ని తీశారు. ఆమె నాతోటి న‌టుడ్ని నా కాళ్ల‌ను తాకేలా చేసింది. ఆమె అత‌డితో 'చీర‌ను పైకి లేపు, ప్యాంటీ క‌నిపించాలి' అని చెప్పింది. ఆమె నాతో ఆడుకుంది. కానీ నేను ఆమె చెప్పింది చేయాల్సి వ‌చ్చింది." అని చెప్పిఇంది ఉర్ఫీ. 

త‌న అంగీకారం తీసుకోకుండానే ఒక లెస్బియ‌న్ సీన్‌ను త‌న‌తో చేయించార‌ని కూడా ఆమె వెల్ల‌డించింది. అప్పుడు త‌ను ఏడ్చాన‌నీ, అలాంటివి త‌ను చేయలేన‌నీ మొత్తుకున్నాన‌నీ చెప్పింది. కానీ ఆ లేడీ ప్రొడ్యూస‌ర్ త‌న‌ను జైలుకు పంపిస్తాన‌ని బెదిరించింద‌నీ, కాంట్రాక్టుపై సంత‌కం చేశావు కాబ‌ట్టి 40 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు న‌ష్ట‌ప‌రిహారం దావా వేస్తానంద‌నీ తెలిపింది ఉర్ఫీ.

ఆ రోజు షూటింగ్ త‌ర్వాత ఇంటికి వెళ్లిపోయిన ఉర్ఫీ, ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ సెట్స్‌పై అడుగుపెట్ల‌లేదు. ఆ ఘ‌ట‌న త‌ర్వాత ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనిపించింద‌ని ఆమె వెల్ల‌డించింది.