English | Telugu

"గంజాయి ఏర్పాటు చేస్తావా?" అన‌న్య‌కు ఆర్య‌న్‌ వాట్సాప్ మెసేజ్‌!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్, నటి అనన్య పాండే మధ్య జరిగిన వాట్సప్ చాట్‌లో గంజాయి గురించి చర్చించుకున్నారని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అనన్య పాండే శుక్రవారం ఎన్సీబీ ఎదుట హాజరుకానున్నారని ఎన్సీబీ తెలిపింది. ఇప్ప‌టికే ఒక‌సారి గురువారం సాయంత్రం తండ్రి చంకీ పాండేతో కలసి అనన్య పాండే ఎన్సీబీ కార్యాలయానికి వచ్చింది. ఈ సందర్భంగా ఆమెను ఎన్సీబీ అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. ఆ క్రమంలో ఆర్యన్‌ ఖాన్‌తో జరిగిన చాట్‌లో గంజాయి అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించగా.. ఆర్యన్‌తో జోక్ చేశానని ఆమె సమాధానం ఇచ్చింది.

ఆర్యన్.. గంజాయి ఏర్పాటు చేస్తావా? అని అనన్యను వాట్సప్‌లో ప్రశ్నించగా.. అలాగే ఏర్పాటు చేస్తానని ఆమె బదులు ఇచ్చింది. అయితే ఆర్యన్, అనన్య పలు సందర్భాల్లో మత్తు మందు గురించి వాట్సప్‌లో చాట్‌ చేసుకోవడాన్ని నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ గుర్తించింది. ఆ క్రమంలో అనన్యను ఎన్సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

అక్టోబర్ 3వ తేదీన డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఇప్ప‌టికే రెండు సార్లు నిరాకరించిన సంగతి తెలిసిందే. అత‌ను అక్టోబ‌ర్ 8 నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఖైదీగా ఉన్నాడు. అయితే ఆర్యన్ వాట్సాప్ గ్రూప్‌లో అనన్యతో చాట్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆమె నివాసంపై ఎన్సీబీ అధికారులు దాడి చేసి.. తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆమెను ఎన్సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నార‌నే సంగతి తెలిసిందే.

అక్టోబర్ 2వ తేదీన ఎన్సీబీ ముంబై యూనిట్‌కు చెందిన అధికారులు సాధారణ దుస్తుల్లో క్రూయిజ్ నౌకలో ప్రయాణించారు. నౌక బయలుదేరిన కొద్ది సేపటికి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వినియోగం, విక్రయం, కొనుగోలు అంశాలపై ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.