English | Telugu

ఒక్క రోజులో జ‌వాన్‌కి 112 మిలియ‌న్ల వ్యూస్!

సోష‌ల్ మీడియాలో నాన్‌స్టాప్‌గా ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్ జ‌వాన్‌. బాలీవుడ్‌కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ న‌టించిన సినిమా ఇది. లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార నార్త్ లో అడుగుపెడుతున్న సినిమా అది. ఫ్లాప్ అంటూ లేని అట్లీ డైర‌క్ట్ చేస్తున్న మూవీ అది. విజ‌య్ సేతుప‌తి, దీపిక ప‌దుకోన్, ప్రియ‌మ‌ణి స్పెష‌ల్ రోల్స్ చేసిన మూవీ జ‌వాన్‌. ద‌ళ‌ప‌తి విజ‌య్ కూడా ఓ కీ రోల్ చేశార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌తి ఫ్రేమ్‌నీ జాగ్ర‌త్త‌గా అబ్జ‌ర్వ్ చేస్తున్నారు జ‌నాలు. విజ‌య్ ఆకారంలో ఉన్న వ్య‌క్తిని రౌండ్ చేసి, ద‌ళ‌ప‌తి న‌టిస్తున్నార‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. జ‌వాన్ ప్రివ్యూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. విడుద‌లైన ఒక్క రోజులోనే 112 మిలియ‌న్ల వ్యూస్ తెచ్చుకుంది. ఇంత‌కు మునుపు ఉన్న అన్ని రికార్డుల‌ను తుడిచిపెట్టేసింది జ‌వాన్ ప్రివ్యూ. విడుద‌లైన అన్ని ప్లాట్‌ఫార్మ్‌ల‌లో క‌లిసి బెస్ట్ రికార్డు సెట్ చేసింది జ‌వాన్‌. ఆదిపురుష్ రికార్డులు కూడా దాటేశారు షారుఖ్‌. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న సినిమా జ‌వాన్‌. ప్రొడ‌క్ష‌న్ పెట్టిన ఖ‌ర్చు ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ లావిష్‌గా ఎస్టాబ్లిష్ అయింది.

షారుఖ్ చెప్పిన డైలాగులు, త‌న గురించి చెబుతూనే, జ‌నాల‌ను పోల్చుకోమంటూ టీజ్‌చేసిన విధానం, రెయిన్‌లో దీపిక యాక్ష‌న్‌, ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ క్యూరియాసిటీ క్రియేట్ చేసిన అట్లీ, అన్నీ క‌లిపి జ‌వాన్‌కి బెస్ట్ ప్లేస్ ఇచ్చేశాయి. జ‌వాన్ ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా అని ఎదురుచూస్తున్నారు ఆడియ‌న్స్. చివ‌రి ఫ్రేమ్‌లో షారుఖ్ గుండుతో క‌నిపించ‌డం స‌ర్‌ప్రైజ్ చేసింది. ఆల్రెడీ ఈ ఏడాది ప‌ఠాన్‌తో వెయ్యి కోట్ల సినిమాల లిస్టులో చేరారు షారుఖ్‌. ఇప్పుడు ప‌ఠాన్ రికార్డుల‌ను జ‌వాన్ కొల్ల‌గొట్ట‌డం ఖాయం అనే మాట స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.