English | Telugu
యాక్షన్ హీరో ఫ్లాప్ టాక్ కహానీ!
Updated : Jul 12, 2023
ఆయుష్మాన్ ఖురానా నటించిన సినిమా యాక్షన్ హీరో. విమర్శకుల ప్రశంసలు పొందింది కానీ, బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. రిలీజ్ టైమ్ పర్ఫెక్ట్ కాకపోవడంతో థియేటర్లలో జనాలను అట్రాక్ట్ చేయలేకపోయిందని అన్నారు ఆయుష్మాన్ ఖురానా. అనిరుద్ అయ్యర్ డైరక్ట్ చేసిన సినిమా యాక్షన్ హీరో. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్‌గా తెరకెక్కింది. డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఓటీటీలో విడుదలైనప్పుడు చాలా మంది రివ్యూలు వచ్చాయి. ఎక్కువ మంది ఈ సినిమాను వీక్షించారు. ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ ``మీడియమ్ బడ్జెట్ సినిమాకు ఇప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయి. సినిమాలు ప్రేక్షకాదరణ పొందిన ప్రతిసారీ నాకు ఆనందంగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే కథల్లో వైవిధ్యమైన వాటిని నేను సెలక్ట్ చేసుకుంటూ ఉన్నాను. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేలా విడుదల చేస్తే హిట్ అవుతామన్నది నా నమ్మకం`` అని అన్నారు.
కరోనా పూర్వం థియేటర్లకు జనాలు ఎంతగా వచ్చేవారో, మళ్లీ అలా వస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఖురానా. డిజిటల్ మీడియా ఎంత పెరిగినప్పటికీ, థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అద్భుతంగా ఉంటుందని అన్నారు. దాన్ని వదులుకోవడానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరని చెప్పారు. తప్పకుండా సినిమా ఇండస్ట్రీకి పూర్వవైభవం వచ్చి తీరుతుందని తెలిపారు. ఆయన ప్రస్తుతం డ్రీమ్ గర్ల్ 2 కోసం రెడీ అవుతున్నారు. ఇందులో కరమ్‌వీర్ సింగ్ రోల్ చేస్తున్నారు. దీంతో పాటు పూజ అనే మూవీ కూడా చేస్తున్నారు.