English | Telugu

దుల్క‌ర్‌కి ఎవ‌రి మాట‌లూ వినిపించ‌వా?

దుల్క‌ర్‌కి ఎవ‌రి మాట‌లూ వినిపించ‌వా?

ఇప్ప‌టిదాకా దుల్క‌ర్‌కి డైర‌క్ట్ గా ప‌రిచ‌యం లేని ప‌దం మాస్‌. ఈ సారి ఆయ‌న కొత్త‌గా మాస్ సినిమా చేశారు. అది కూడా పుష్ప త‌ర‌హా మాస్ సినిమా చేశారు. కింగ్ ఆఫ్ కోతా అనే ఈ మూవీ ఈ నెల 24న విడుద‌ల‌కు రెడీ అవుతోంది. త‌న ఫిల్మ్ సెల‌క్ష‌న్ గురించి చాలానే చెప్పారు దుల్క‌ర్ స‌ల్మాన్‌. దుల్క‌ర్ మాట్లాడుతూ ``నాతో చాలా మంది చాలా చాలా విష‌యాల‌ను చెబుతుంటారు. అయితే నేను వేటినీ ప‌ట్టించుకోను. నా మ‌న‌సుకు న‌చ్చింది చేసుకుంటూ పోతాను. సినిమా రంగంలో స‌క్సెస్‌కి స్పెష‌ల్ రూట్స్ ఉండ‌వు. అస‌లు ఏది ఎప్పుడు ఎందుకు వర్క‌వుట్ అవుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. అందుకే, నేను ఎవ‌రి మాటా విన‌ను. నాకు రైట్ అనిపించింది మాత్ర‌మే చేస్తాను. ప్ర‌స్తుతం నేను నా జ‌ర్నీని ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్క‌డో కాలు, అక్క‌డో కాలు ఎందుకు పెడ‌తావు? స‌రిగా ఒక భాష‌లో స్థిర‌ప‌డు అని చాలా మంది స‌ల‌హా ఇస్తుంటారు.

కానీ అవేమీ పట్టించుకునే స్థితిలో నేను లేను. ఎందుకంటే నాకు కావాల్సింది మంచి స్క్రిప్టులు. మంచి క‌థాక‌థ‌నాలు ఉంటే బ్యాడ్ డైర‌క్ష‌న్ ఉన్నా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. న‌టీన‌టులు స‌రిగా న‌టించ‌క‌పోయినా ఎవ‌రికీ గుర్తుండ‌దు. అందుకే మంచి క‌థ‌ల‌ను మిస్ చేసుకోవ‌డానికి నాకు ఇష్టం ఉండ‌దు. ఇలా అన్నీ భాష‌ల్లోనూ న‌టిస్తూ ఉంటే, చివ‌రికి ఎవ‌రూ ఓన్ చేసుకోరు. ఎవ‌రికీ కాకుండా పోతావు. స్ట్రాంగ్ బేస్ ఒక చోట ఉండాల‌ని కూడా ప‌లువురు అంటున్నారు. నేను న‌వ్వి ఊరుకుంటున్నాను`` అని అన్నారు. కొన్నిసార్లు త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన స్క్రిప్టుల‌ను కూడా కొంత‌మంది లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చెప్పారు. కింగ్ ఆఫ్ కోతాలో ప‌క్కా మాస్ అవ‌తార్‌లో క‌నిపిస్తున్నారు దుల్క‌ర్‌. ఈ సినిమా స‌క్సెస్ అయితే, తాను కంప్లీట్ మాస్ రూట్లోనే వెళ్లాల‌ని కూడా అనుకోవ‌డం లేద‌ని చెప్పారు. వెరైటీ ట్రై చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.