English | Telugu

లతా మంగేష్కర్ భౌతికకాయం వద్ద షారుఖ్ ఉమ్మేశాడా.. అసలు నిజమేంటి?

గానకోకిల లతా మంగేష్కర్ ఆదివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఆమె అంత్యక్రియల్లో సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు. వారిలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా ఉన్నాడు. అయితే షారుఖ్ నివాళులర్పించిన విధానాన్ని తప్పుగా అర్ధం చేసుకున్న కొందరు ఆయనపై మండిపడ్డారు. మరికొందరు మత పరమైన విమర్శలు కూడా చేశారు.

లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో పాల్గొన్న షారూఖ్‌ ఆమె భౌతికకాయం చుట్టూ తిరిగి చేతులు జోడించి నమస్కారం చేశాడు. ఇస్లాం మత పద్దతిలో ప్రార్థించిన తర్వాత షారూఖ్‌ నోటి నుంచి గాలి ఊదారు. అయితే షారుక్‌ అలా గాలి ఊదడాన్ని ఉమ్ముతున్నట్టుగా క్రియేట్‌ చేసి కొందరు ఆయన్ని ట్రోల్‌ చేస్తున్నారు. హిందువులకు ఉన్నట్లే ముస్లింలకు కూడా మతాచారాలు ఉంటాయని, వారి మతాచారం ప్రకారమే షారుఖ్ దువా చదివి గాలి ఊదారని, అది తెలియకుండా ఇలా ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొందరు తమ రాజకీయ లబ్దికోసం కావాలనే ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ అంశంలో సినిమా ప్రముఖులతో పాటు, ఎందరో హిందువులు షారుఖ్ కి మద్దతుగా నిలుసున్నారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.