Read more!

English | Telugu

హృతిక్ రోష‌న్ 'అగ్నిప‌థ్'కి ప‌దేళ్ళు!

'బిగ్ బి' అమితాబ్ బ‌చ్చ‌న్ కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిలిచే చిత్రాల్లో 'అగ్నిప‌థ్' ఒక‌టి.  1990లో విడుద‌లైన ఈ యాక్ష‌న్ క్రైమ్ డ్రామా.. భారీ బ‌డ్జెట్ కార‌ణంగా హిట్ సినిమాల లిస్ట్ లో చేర‌క‌పోయినా, అమితాబ్ కి తొలిసారిగా `జాతీయ ఉత్త‌మ న‌టుడు` అవార్డుని అందించింది. కాల‌క్ర‌మంలో `కల్ట్ క్లాసిక్`గా రికార్డుల‌కెక్కింది. అలాంటి చ‌రిత్ర ఉన్న `అగ్నిప‌థ్`ని 22 ఏళ్ళ త‌రువాత అదే పేరుతో రీమేక్ చేయ‌గా.. మ‌రో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించారు.

ప్రియాంక చోప్రా హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమాలో సంజ‌య్ ద‌త్, రిషి క‌పూర్, జ‌రీనా వ‌హాబ్, ఓంపురి, చేత‌న్ పండిట్, స‌చిన్ ఖేడ్క‌ర్, పంక‌జ్ త్రిపాఠి, క‌నికా తివారి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ప్ర‌ముఖ న‌టి క‌త్రినా కైఫ్.. పాపుల‌ర్ సాంగ్ ``చికినీ ఛ‌మేలీ``(శ్రేయా ఘోష‌ల్ గానం)లో త‌న చిందుల‌తో క‌నువిందు చేసింది. త‌న తండ్రి, భార్య చావుకి కార‌కుడైన వ్య‌క్తిపై ప్ర‌తీకారం తీర్చుకునే విజ‌య్ దీన‌నాథ్ చౌహాన్ అనే ఓ యువ‌కుడి క‌థే `అగ్నిపథ్` చిత్రం.

క‌ర‌ణ్ మ‌ల్హోత్రా తొలిసారిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై పాపుల‌ర్ ఫిల్మ్ మేక‌ర్ క‌ర‌ణ్ జోహార్ నిర్మించారు. అజ‌య్ - అతుల్ సంగీతం `అగ్నిప‌థ్`కి అద‌న‌పు బ‌లంగా నిలిచింది. 2012 హ‌య్య‌స్ట్  గ్రాస‌ర్స్ లో ఒక‌టిగా నిలిచిన `అగ్నిప‌థ్`.. హృతిక్ రోష‌న్ కెరీర్ లో ఓ మెమ‌ర‌బుల్ మూవీగా నిలిచింది. రిప‌బ్లిక్ డే స్పెష‌ల్ గా 2012 జ‌న‌వ‌రి 26న రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించిన `అగ్నిప‌థ్`.. నేటితో ప‌దేళ్ళు పూర్తిచేసుకుంది.