Read more!

English | Telugu

ఓటీటీలో రిలీజైతే క‌లెక్ష‌న్లు రావ‌నే అభిప్రాయాన్ని తుత్తునియ‌లు చేసిన 'పుష్ప‌'

 

జనవరి 14న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్‌లో 'పుష్ప' హిందీ వెర్ష‌న్‌ రిలీజ‌యిన‌ప్పుడు, అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నెమ్మ‌దించ‌వ‌చ్చ‌నే చ‌ర్చలు  ఇండ‌స్ట్రీలో జరిగాయి. ఒక బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా ఈ సినిమా ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందనే నిజాన్ని బ‌ట్టి అలా అనుకున్నారు. ఏదేమైనప్పటికీ, అల్లు అర్జున్ అన్ని అపోహలను తొల‌గించ‌డ‌మే కాకుండా వాటిని తుత్తునియ‌లు చేశాడు. ఎందుకంటే 'పుష్ప‌' డిజిటల్ ప్రీమియర్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఇంకా న‌డుస్తూనే ఉంది.

థియేట‌ర్ల‌లో విడుద‌లైన నాల్గవ వారం చివరిలో ప్రీమియర్ అయిన‌ తర్వాత, ఈ ఫిల్మ్ ఐదో వారంలో రూ. 7.30 కోట్లు, ఆరో వారంలో మరో రూ. 6 కోట్లు వసూలు చేసింది. దాంతో మొత్తం కలెక్షన్ రూ. 97 కోట్ల (నెట్‌)కు చేరుకుంది. ఇది ఇప్పుడు 100 కోట్ల మార్కును క‌చ్చితంగా అందుకోనుంది. ఇది రానున్న ప‌ది రోజుల్లో జ‌రుగుతుంద‌ని అంచ‌నా. అంటే OTT రిలీజ్ త‌ర్వాత 'పుష్ప' హిందీ వెర్ష‌న్‌ మొత్తం కలెక్షన్లు రూ. 15 కోట్లకు పైగా ఉంటాయి. 

Also read: తెలంగాణ‌లో 'బంగార్రాజు' రిక‌వ‌రీ క‌ష్ట‌మే!

నిజానికి, ఆరో వారం క‌లెక్ష‌న్ల విష‌యంలో ఈ సినిమా 2001 ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ 'గదర్: ఏక్ ప్రేమ్ కథ', 2017 నాటి స్లీపర్ హిట్ 'బదాయి హో' తర్వాత అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన మూడో సినిమాగా నిలిచింది. గురువారం కలెక్షన్లు రావడంతో, ఆరో వారం క‌లెక్ష‌న్ల‌లో ఈ చిత్రం య‌స్‌.య‌స్‌. రాజమౌళి 'బాహుబలి 2'ని ఓడించడం విశేషం. 'పుష్ప'కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి పోటీ లేదు. అయితే ఈ క‌లెక్ష‌న్లు ఆ సినిమాని ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయ‌డం వ‌ల్లే వ‌స్తున్నాయి. ర‌ణ‌వీర్ సింగ్ '83' మూవీ కూడా సినిమా హాళ్లలో రన్ అవుతోంది. అయితే ఆడియెన్స్ ఆ సినిమాపై ఆస‌క్తి చూపించ‌డం లేదు. అందుకే ఎక్కువ ప్రాంతాల్లో ఆ సినిమాకి చాలా త‌క్కువ క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. 

Also read: ఎన్టీఆర్ న‌టించగా రూ. 4.5 ల‌క్ష‌ల‌తో త‌యారైన‌ టాలీవుడ్‌ ఫ‌స్ట్ స‌స్పెన్స్ ఫిల్మ్ ఇదే!

బిగ్‌ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రత్యామ్నాయం లేదని 'పుష్ప' కలెక్షన్లు ధ్రువీకరించాయి. 90వ దశకంలో టెలివిజన్ త‌ర‌హాలోనే ఇప్పుడు OTT కూడా ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రత్యామ్నాయ మాధ్యమంగా పుట్టుకొచ్చింది. ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, డ‌బ్బునూ, స‌మ‌యాన్నీ వెచ్చించాల్సి వ‌చ్చినా ప్రేక్షకులు ఎప్పుడూ సినిమా హాళ్లలో పెద్ద స్క్రీన్‌పై సినిమాను చూసి ఆస్వాదించ‌డానికే ఇష్టపడతారు. గత కొన్ని నెలలుగా ప‌లు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కార‌ణం, వాటి కంటెంట్ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు లేక‌పోవ‌డ‌మే. అయితే తెలుగు నుంచి హిందీలోకి డ‌బ్బింగ్ అయిన 'పుష్ప' రూ. 100 కోట్ల క్ల‌బ్‌లోకి ప్ర‌వేశించ‌నుండ‌టం క‌ళ్లు తెరిపించే విష‌యం.