English | Telugu

మాల్దీవుల్లో బికినీతో కేక‌పుట్టిస్తున్న క‌త్రినా! విక్కీ ఎక్క‌డ‌?

ఒక బ్రాండ్ షూటింగ్ కోసం మాల్దీవుల్లో ఉంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌. అక్క‌డ బీచ్‌లో త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ వాటి ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు క‌నువిందు చేస్తోంది. ఈమ‌ధ్యే తోటి బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ విక్కీ కౌశ‌ల్‌ను పెళ్లాడిన ఆమె, బీచ్‌లో చిల్ అవుతూ తీయించుకున్న రెండు ఫొటోల‌ను మంగ‌ళ‌వారం షేర్ చేసి ఫ్యాన్స్‌ను అల‌రించింది. ఆ ఫొటోల్లో బ్లూ బికినీ టాప్‌, హై-రైజ్ బాట‌మ్, వైట్ మెష్ ష‌ర్ట్ ధ‌రించి క‌నిపించిందామె. ఆ పిక్చ‌ర్స్‌ను షేర్ చేసి, “Seas the day” అనే క్యాప్ష‌న్‌తో పాటు కొన్ని హార్ట్ ఎమోజీల‌ను జోడించింది.

Also read:మహేష్ బాబుకి మామ‌గా మోహ‌న్ బాబు.. మ‌ర‌ద‌లిగా మిస్ మీన‌న్!

ఆమె త‌న ఫొటోల‌ను షేర్ చేసిన వెంట‌నే ప‌లువురు ఫ్యాన్స్ కామెంట్స్ సెక్ష‌న్‌ను హార్ట్‌, ఫైర్ ఎమోజీల‌తో హోరెత్తించారు. ఒక అభిమాని, "విక్కీ ఎక్క‌డ?" అని ప్ర‌శ్నించాడు. దానికంటే ముందు త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో త‌ను మాల్దీవుల్లో హ్యాపీగా గ‌డుపుతున్న క్ష‌ణాల‌కు సంబంధించిన కొన్ని వీడియోల‌ను కూడా షేర్ చేసింది క‌త్రినా. చేతిలో బ‌ర్డ్ ఫుడ్ పెట్టుకొని కొన్ని ప‌క్షుల‌కు తిండిపెడుతూ ప‌ర‌వ‌శించి పోతోందామె.

వ‌ర్క్ విష‌యానికొస్తే, విక్కీ కౌశ‌ల్‌తో పెళ్లి త‌ర్వాత మ‌ళ్లీ షూటింగ్‌ల‌కు హాజ‌ర‌వుతోంది క‌త్రినా. స‌ల్మాన్ ఖాన్‌తో 'టైగ‌ర్ 3' షూటింగ్‌లో పాల్గొన‌నున్న‌ది. అయితే కొవిడ్ 19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా దాని షూటింగ్‌లో జాప్యం జ‌రుగుతోంది. ఆ మూవీతో పాటు 'ఫోన్ బూత్' కూడా ఆమె లిస్టులో ఉంది. అలాగే విజ‌య్ సేతుప‌తితో క‌లిసి ఓ సినిమాని, ప్రియాంక చోప్రా, ఆలియా భ‌ట్‌తో క‌లిసి 'జీ లే జారా' సినిమానీ ఆమె చేస్తోంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.