English | Telugu

యూట్యూబ్ స్టార్ పెళ్ళి కొడుకు అయ్యాడు!

'చక్రవాకం' సీరియల్ గురించి దాదాపు అందరికి తెలిసిందే. ఒకప్పుడు తెలుగు సీరియల్స్ లో చరిత్ర సృష్టించిన సీరియల్. అందులో నటించిన ఇంద్రనీల్ అందరికి సుపరిచితమే. ఈ సీరియల్ లో ఇంద్ర నీల్ కి ప్రశంసలు అందాయి. ఇంద్రనీల్ కి లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువగనే ఉండేవారు.

అయితే ఇంద్రనీల్, మేఘన రామి పెళ్ళి చేసుకున్నారు. కాగా వీరిద్దరికి ఒక యూట్యూబ్ లో 'నీలిమేఘాలలో' అనే ఛానెల్ కూడా ఉంది. ఇందులో వీరిద్దరు కలిసి రెగ్యులర్ గా వ్లాగ్ లు చేస్తుంటారు. అందులో రకరకాల వంటలతో పాటు , డ్రెస్సింగ్, చీరలకి సంబంధించిన వ్లాగ్ లు.. ఇవే కాకుండా చాలా రకాల వ్లాగ్ లు చేస్తూ అప్డేట్ చేస్తుంటారు. కాగా వీరికి అత్యధిక ఫ్యాన్ బేస్ కూడా ఉంది‌. దాంతో వీళ్ళిద్దరు కలిసి ఏ వ్లాగ్ ని తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసినా అత్యధిక వీక్షకాధరణ పొందుతుంది.

అయితే తాజాగా ఇంద్రనీల్, మేఘన రామి ఇద్దరు చాలా సీరియల్స్ లో నటించారు. కాగా మేఘన రామి ఇప్పుడు జీ తెలుగులో ప్రసారమవుతున్న 'రాధమ్మ కూతురు' సీరియల్ లో ముఖ్య పాత్రని పోషిస్తుంది. కాగా ఇంద్రనీల్, మేఘన రామి కలిసి తాజాగా తమ 'నీలిమేఘాలలో' యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్లాగ్ ని అప్లోడ్ చేశారు.

"యూట్యూబ్ స్టార్ పెళ్ళి కొడుకు అయ్యాడు" అనే ఒక వ్లాగ్ ని ఇంద్రనీల్, మేఘన రామి ఇద్దరు తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు. ఆ పెళ్ళిలో వాళ్ళు ఏం చేశారు అంటూ వివరిస్తూ చేసిన ఈ వీడియోకి అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది. అయితే ఇంద్రనీల్, మేఘన రామి గారి ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సీరియల్ చేయొచ్చు కదా అని ఒకరు, బాగుందంటూ మరొకరు కామెంట్లు చేస్తున్నారు. కాగా చక్రవాకం సీరియల్ అభిమానులు ఇప్పటికీ వీరిని మర్చిపోలేదంటే వీరి ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది. కాగా ఇంద్రనీల్, మేఘన రామిల యూట్యూబ్ ఛానెల్ 'నీలిమేఘాలలో' కి నాలుగు లక్షలకి పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.