English | Telugu
రిషిని చంపమని రౌడీని పంపించిన శైలేంద్ర!
Updated : Jul 21, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -820 లో.. జగతి, మహేంద్ర ఇంటికి వెళ్ళడానికి బయల్దేర్తారు. 'మీరు రిషిని వసుధారని మీ ఇంటి మనుషులలాగా చూస్తున్నారు. మీరు చాలా గొప్పవాళ్ళ'ని విశ్వనాథ్ ని జగతి పొగుడుతుంది.'ముఖ్యంగా నీకు థాంక్స్ ఏంజిల్.. రిషి ని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు' అని జగతి అనగానే.. 'రిషి నా ఫ్రెండ్. తనని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత' అని ఏంజిల్ అంటుంది. 'అయినా, రిషి గురించి మీరు నాకు థాంక్స్ ఎందుకు చెప్తున్నార'ని ఏంజిల్ అంటుంది. అప్పుడు వసుధార కవర్ చేస్తూ 'రిషి సర్ లాంటి గొప్పవాళ్ళ గురించి ఎవరైనా అలాగే చెప్తార'ని అంటుంది.
ఆ తర్వాత జగతి వెళ్తు వసుధార దగ్గరికి వస్తుంది. మీరు ఇద్దరు మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు చేపట్టాలని జగతి అంటుంది. మహేంద్ర కూడా వసుధారతో మిషన్ ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేయమని అంటాడు. మీరు ఏది అనుకుంటున్నారో అది నిజం అవుద్దని వసు అంటుంది. జగతి, మహేంద్ర లు వెళ్తుంటే.. రిషి ఎదురు వస్తాడు. వెళ్ళొస్తాం రిషి అని జగతి, మహేంద్ర చెప్పినా రిషి సైలెంట్ గా ఉంటాడు.. మరొక వైపు విష్ కాలేజీ లెక్చరర్స్ కలిసి రిషి, వసుధారల గురించి తప్పుగా మాట్లాడుకుంటారు.
ఇన్ని సంవత్సరాల నుండి కాలేజీ లో వర్క్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా మనకి సన్మానం లాంటివి లేదు. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్లకి సన్మానం అని ఒక సర్ అనగానే.. అవును సర్ వాళ్ళ ఇద్దరికి సపోర్ట్ గా కాలేజీ చైర్మన్ ఉన్నాడు. పైగా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు ఆ చైర్మన్ ని బుట్టలో వేసుకున్నారు. పైగా ఆ ఏంజిల్ కి రిషి సర్ ఫ్రెండ్. అందుకే వాళ్లకి సపోర్ట్ అని మేడం అంటుంది. రిషి సర్ వసుధార మేడం ఇద్దరి మధ్య ఏదో ఉందని సర్ అనగానే.. అవును ఇద్దరు వయసులో ఉన్నారు. ఉంటే తప్పేముందని ఒజ మేడం అంటుంది. వాళ్ళ మాటలు విన్న పాండియన్ కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చి.. మీరు వాళ్ళు గురించి అలా తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎప్పుడు చదువు కోసం, స్టూడెంట్స్ జీవితాలు బాగు చేయడం కోసం ఆలోచిస్తారు. మీరు ఇంకొకసారి వాళ్ళ ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడితే కొద్దిసేపు నాలో పాత పాండియన్ బయటకు వస్తాడని పాండియన్ ఆ లెక్చరర్స్ కి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.
మరొక వైపు బాల్కనీ లో రిషి కూర్చొని అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారని ఆలోచిస్తుంటాడు. పైన బాల్కనీలో వసుధార కూర్చొని పేపర్ పై VR అని రాస్తుంది. ఆ పేపర్ కింద కూర్చొని ఉన్న రిషి పై పడుతుంది. అది చుసిన రిషి చింపేస్తుండగా.. వద్దని వసుధార అంటుంది. రిషి ఆపేస్తాడు. మరొక వైపు రిషిని చంపాలని ఒక రౌడీని శైలేంద్ర పంపిస్తాడు. రిషి హాల్లో ఫోన్ చూస్తుంటాడు. అప్పుడే రౌడీ వెనకాల నుండి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.