Facebook Twitter
పుష్కరాల గోదావరి పద్యాలు


గోదావరి పుష్కరాల పద్యాలు


!! గోస్తని దివ్య పాక పద గుంభన సుస్వర వాణి తో న భే
దా స్తబక ద్విరేఫ మధు ధారల మాధురితో విరాళితో  
వస్తివి పుష్కర ప్రభతో వాసవ దేవ మునీం ద్రులెల్ల తీ
రి స్తుతిచేయ,గౌతమి హరించుము మాదు విచారమంతటిన్


శా!! గోక్షీరామృత ధారగన్ యలరచున్ ఘోషించు గోదావరీ..!
దాక్షిణ్యంబున తల్లివై ప్రబలు ఆర్త్రత్రాణ పారాయణీ
వక్షాంబోరుహ జాత నాక సుధగన్ వర్షించు దివ్యార్ద్రవా
రీ..! క్షంతవ్యుల మీదనా కినుక పారెన్ ప్రాణముల్ పౌష్కరీ..!

తే. గీ || గోప బాలుడు గాంచగ గోపిక పర
దాలు వీడి పరువులెత్తె, తాను నదిగ,
వలచె వనమాలి శరధిని, వంపు చను సి
రిని గని తన సిరి యని హరి రతి జరిపె
గోగు పూలు హారతులెత్త, గోరువంక
దాకొని సరిగమలు పాడ, తాలమేసె
వనము, గొంతుకలిపె మంద పవనము, శబ
రి మనసు లయగ గోదావరిన్ స్మరించె

Padmakar Guntur

సీ ॥    గో మారక దురితాఘోర హరణముకై బిరబిర ధరణిన బెరసి నరుల
దారుణ గరి దురిత ఝరిని పొరిచూపున పరిహరించు, ఘన రస కరుణ
వర ఝరి సరసన పరి పరి పరఝరి కూరిమి పొరలిన గురు దురిత  ప
రిహరణ గోరి మురిపెపు గోదావరి పూర్ణ ఝరిన జేరె పుష్కరుండు

తే ॥   గోరసామృత మధుర రుచిర సుర ఝరి
దాతృ మూర్తి గోదావరి, ధరణి యడర
వరము తెరగున పుశ్కరుడరుగె ధరణి
రిప్ర హర ఝరి జేరంగ రిప్ర హరుడు

తే ॥    గోవుదానంబు నిచ్చిన గొప్ప ఫలము
దారి వేసవి శుచి జల దాన ఫలము
వలజ దానంబు జేసిన పాటి ఫలము
రిక్త గోదారి పుష్కర సిక్త ఫలము

తే ॥    గోదమందున వేరొద్ది గోరుకొనక
దాతృభావంబు పొంగంగ దాన మిచ్చి
వరద గోదారి పుష్కర భాసుర సుఝ
రి సరస ముదిత స్నానము రిప్ర హరము

Raghu Kishore Marupaka

తే. గీ || గోచరించనే పుష్కర  ఘోష, దొరికె
దానమిచ్చు వారికి  కడు దానఫలము
వడిగ జేరె జనుల దరి భాగ్యరాశి
రివ్వున ఎగసె గౌతమి రిప్రహరణి

Rambabu Kaipa

 

..... Telugu Velugu Samithi

Infosys Hyderabad