Facebook Twitter
అనిత


 


               

  - డా|| సి|| ఆనందారామం


 పార్ట్ - 3

 

  "కూడూ, గుడ్డా తప్ప జీవితంలో ఇంకేమీ లేవా?"

    "ఎందుకు లేవూ? గుఱ్ఱపు పందేలున్నాయి. ఎంత సరదాగా  ఉంటుంది? వస్తే లక్షలోస్తాయి."

    "లేకపోతే చిప్ప చేతికొస్తుంది"

    "వస్తే వస్తుంది. జీవితంలో కష్టపడి సంపాదించి ఏనాటికి. ఐశ్వర్యవంతులం కాగలం? అదృష్టం  కలిసొస్తే ఇలాగే  రావాలి."

    "ఒక్కటి మరిచి పోతున్నారు. అదృష్టమనేది మనసు వెతుక్కుంటూ వచ్చేది. మనం   వెతుక్కుంటే దొరికేది కాదు."

    "అదృష్టం సంగతేమో కాని, ఐశ్వర్యం మాత్రం మనం సాధించి పొందవలసిందే!"

    ఆ మాటలతో ఆసక్తిలేని సుశీల తిరిగి పుస్తకంలో తలదాచుకుంది.

    "నేనూ చదువుతాను పుస్తకాలు. కానీ ఇలాంటి చెత్త పుస్తకాలు చదవను. మంచి మంచి పుస్తకాలు చదువుతాను."

    పుస్తకాలలో ఆసక్తిగల సుశీల చిటుక్కున తలెత్తి "ఏం పుస్తకాలు?" అంది.

    "ఖాతా పుస్తకాలు. వద్దు పుస్తకాలు, లాటరీ పజిల్స్, చెక్ పుస్తకాలు........"

    "పకపక నవ్వింది సుశీల.

    అప్పుడే లోపలకు వచ్చిన రాజారావు సుశీల నవ్వు చూసి "ఏవిటి నవ్వుతున్నావ్?" అన్నాడు.

    "మీ స్నేహితుడు అత్యంత ఉత్తమ సాహిత్యమంటే ఏమిటా చేపుతాన్నారు. వింటే నవ్వాగలేదు."

    "ఏమిటి?"

    "ఖాతా పుస్తకాలు!"

    రాజారావు పెదవులపైన చిరునవ్వు విరిసింది సుశీల గడియారం చూసుకుని విముక్తిపొందిన దానిలా లేచి "అన్నయ్యా! నేను సంగీతం క్లాసు కెళ్ళాలి. టైమయిపోతోంది." అంది.

    "వెళ్ళిరా!" అన్నాడు రాజారావు.

    "ఎందుకండీ, ఆడపిలల్లకు సంగీతం? కూడు పెడుతుందా? గుడ్డ పెడుతుందా? అంతకన్న ఇంట్లోపనిపాటలు నేర్చుంకుంటేమేలు!"

    రాజారావుముఖం గంభీరం కావటంచూసి తను పొరపాటుగా మాట్లాడానని నొచ్చుకున్నాడు, రమణరావు.

    సుశీల సహించలేకపోయింది.

    "లాలితకళలు కూడూ, గుడ్డా పెట్టావు. నిజమే! కాని మనసు కొక మధురమైన ఆనందాన్ని కలిగిస్తాయి. గుఱ్ఱపు పందేలూ, లాటరీలు తప్ప మరొకటి తెలియని వాళ్లకి ఆ ఆనందం అర్థం కాకపోవటంలో ఆశ్చర్యం లేదు.   అది వాళ్ల దురదృష్టం !"

    "సుశీలా!" అన్నాడు రాజారావు మందలిస్తున్నట్లు _ _

    సుశీల మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్లిపోయింది.

   
               4

    ఆరోజే అనిత వస్తోంది. శారదమ్మ ఒకటే హడావుడి పడ్తోంది. చాలా రోజుల తర్వాత ఆవిడ  మనసు  ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. శారదమ్మకు దగ్గిర దగ్గిర సంవత్సరం క్రిందట జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.

    తలవని తలంపుగా వచ్చిన అన్నను చూసి ఆశ్చర్యపోయింది శారదమ్మ.

    పిచ్చిదానిలా చూస్తోన్న శారదమ్మను చూసి ఆప్యాయంగా తల నిమురుతూ "నేనే శారదా! ఏమిటలా చూస్తావ్?" అన్నాడు  దయాశంకర్ నవ్వుతూ.

    "అన్నయ్యా! నువ్వేనా? వచ్చావా? ఏన్నాళ్లకు కానీపించావ్ ?"

    పెదవులపై చిరునవ్వు, కళ్లలో కన్నీళ్ళు చిందిస్తూ అంది శారదమ్మ.

    "ఎప్పుడో వచ్చేవాణ్ణి. మీరు రానిస్తే ......"

    శారదమ్మకు కలుక్కుమంది. సమాధానం చెప్పలేని స్థితిలో తల వంచుకుంది.

    దయాశంకర్ ఒక ఆంగ్లో ఇండియన్ యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆ రోజుల్లో అది బంధువర్గంలో పెద్ద దుమారం రేపింది.

    భార్యను తీసుకుని  చెల్లెలి ఇంటికి వచ్చాడు దయాశంకర్.

    లక్ష్మీపతి వీధి తలుపులు వేసేసి "నేను పరువు ప్రతిష్ఠలతో బ్రతుకుతున్నవాడిని. నీ ఇష్టమొచ్చినట్లు నువ్వు ఊరేగు. నా ఇంట్లో మాత్రం అడుగుపెట్టకు. నా బ్రతుకు బజారుపాలు చెయ్యకు" అన్నాడు.

    తనదైన వ్యక్తిత్వం ఏనాడో చంపుకున్న శారదమ్మ బొమ్మలా నిలబడి పోయింది.

    తన భార్యతో వీథిలోంచే తిరిగి వెళ్ళిపోయిన దయాశంకర్ ఇరవై ఏళ్ళ తరువాత తిరిగి ఆ ఇంటికి వచ్చాడు.

    "వదినను తీసుకొచ్చావా?"

    "మీ వదిన నీ కసలు తెలియదు  గనుక ఈ ప్రశ్న అడిగావు. ఆవిడ కెంత ఆత్మాభీమానమో తెలుసా? ఆ కంఠంలో ప్రాణం ఉండగా  తనను  అవమానించిన ఇంట్లో అడుగు పెడుతుందా? ఆవిడను పై లోకానికి సాగనంపాకే ఇక్కడికి వచ్చాను."

    ఈ మాటలంటున్నప్పుడు దయశంకర్ కంఠం సన్నగా వణికినా పెదవులు మాత్రం నవ్వుతూనే ఉన్నాయి,

    శారదమ్మ ఈ మాటలు విని నిజంగానే నొచ్చుకుంది.

    తన  అన్నగారిజుట్టు అంతాగా నెరిసిపోవటానికి, ముఖం బాగా ముడతలు వడటానికీ వృద్దాప్యం కారణం కాదని అప్పుడు అర్థమయింది.

    "అయ్యయ్యో! అన్నయ్యా! పాంప, నీకు ...."

    దయాశంకర్  చేయెత్తి చెల్లెల్ని వారించాడు.

    "శారదా! ఆగాగు ఇప్పుడు నేను వచ్చింది పరామర్శలు చేయించుకోవడానికి కాదు. పెళ్లి సంబందాలు వెతకటానికి....."

    శారదమ్మ పిచ్చిపట్టిన దానిలాగా చూపింది.

    "ఏవిటి? పెళ్లి సంబంధాలా? నువ్వు మళ్ళీ ఈ వయసులో."

    విగబడి నవ్వాడు దయాశంకర్...

    "పిల్లనిచ్చేవా డుంటే నేనూ చేసుకుంటాను. కానీ పెళ్ళి సంబంధాలు వెతక వలసింది నాకు కాదు. అనితకి___"

    "అనిత ఎవరు?"

    "ఓ! నీ కసలు ఏమీ  తెలియదు కదూ! అనిత నా కూతురు. బంగారు బొమ్మ ఫోటో చూడు."

    అనిత  ఫోటో శారదమ్మ కిచ్చాడు దయాశంకర్.

    "ఎంత బాగుంది! అచ్చు  హిందువుల పిల్లలాగా_" ముచ్చట పడింది శారదమ్మ.

    "అవును. దానికి అన్నీ  మన అలావాట్లే వచ్చాయి. నేను రోజాను పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ 'నీకు పిల్లలు పుడితే పెళ్లేలా చేస్తావ్?' అని భయపెట్టారు.

    ఆ మాటలు రోజాతో  చెప్తే రోజా నవ్వేసి మనలాగే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు,' అనేసింది అదే బాగుందని ఇన్నాళ్లూ నిశ్చింతగా ఉన్నాను. ఈ అనిత ఉందే. ఇది  నా ప్రాణం తీసింది."

    "ఏం? ఎవరిని ప్రేమించింది?"

    భయంగా అడిగింది శారదమ్మ.

    పకపక నవ్వాడు దయాశంకర్.

    "ప్రేమిస్తే బెంగదేనికి? సుఖంగా అది కోరిన వాడికిచ్చి పెళ్ళి చేసే వాడిని. అది ఎవరినీ ప్రేమించలేదు. 'నీ యిష్టం నాన్నా! నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళను చేసుకుంటాను అంది."

    "ఎంత మంచి పిల్ల!" మురిసిపోయింది శారదమ్మ

    "మంచిదా? రణగోండిరాలుగాయ? ఇప్పుడు  న్నేం చెయ్యమంటావో చెప్పు. చచ్చినట్లు సంబంధాలు వెతుకుతున్నాను. ఈ ఊళ్ళో ఒక సంబంధం ఉందని విని వచ్చాను. పెళ్ళికొడుకు......"

    దయాశంకర్ మాట పూర్తీ కాకుండనే రాజారావు వచ్చాడు.

    "ఇత నెవరు?" ఆశ్చర్యంగా అడిగాడు దయాశంకర్.

    "మా పెద్దబ్బాయి రాజారావు. లా పాపయి ఈ ఊళ్ళోనే లాయరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇటు పొలం పనులు కూడా వాడే చూసుకుంటున్నాడు. వీడి తరువాతది సుశీల బి. యస్ సి. చదువుతోంది. దీనికి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాం. సంబంధం ఇంచుమించు కుదిరినట్లే. ఆ తరువాతది కమల పోర్తుఫారం చదువుతోంది. ఆఖరివాడు కన్ని - సెకండ్ ఫారంలో ఉన్నాడు."

    "బాగుంది!"

    తాజారావునే చూస్తూ ఆలోచిస్తూ అన్నాడు దయాశంకర్.

    "రాజా! ఈయన మీ మావయ్య".

    "రాజారావు దయాశంకర్ ని ఎన్నాడూ చూడకపోయినా అతని గుఱించి విన్నాడు నమస్కారంచేసి "అత్తయ్యగారిని కూడా తీసుకొచ్చారా?" అన్నాడు మామూలు మర్యాద సూచకంగా_

    "ఆహా! పరవాలేదోయ్ ! మా కంటె మీరే నయం. మీ నాన్న మమ్మల్ని వీథిలోంచే వెళ్ళకొట్టాడు. నువ్వు ప్రేమగా అత్తయ్య గారిని గూడా తీసుకు రమ్మంటున్నావ్! ప్చ్! ఈ మార్పు చూసే అదృష్టం ఆవిడికి లేదయ్యా! పై లోకానికి వెళ్ళిపోయింది."

    "అయామ్ సారీ!"

    "దట్సాల్ రైట్!"

    మీ ఆరోగ్యం బాగుందా?"