Facebook Twitter
చూపులు కలపని శుభమనిషి

చూపులు కలపని శుభమనిషి

- స్వప్న కంఠంనేని

చూపులు కలపని శుభమనిషి :


అమ్మాడు, నువ్వు ప్రేమిస్తున్న నీతో మాట్లాడుతున్నపుడు నీ కళ్ళలోకి కాకుండా ఎంతసేపూ నీ భుజాలు,నీ చుబుకం, నీ  మెడ, నీ నుదురు .... ఇలా వేరే అవయవాల   వేపు చూస్తున్నాడనుకో  అప్పుడేమనుకుంటావ్

* అతగాడు తప్పనిసరి గా నీ గురించిఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాడు. మనిషి కొంచం సిగ్గరి కావచ్చు.స్వయంస్పృహ కలవాడు కావచ్చు.
*  ఇలాంటి కుర్రవాణ్ణి కనుక నువ్వు వలలో వేసుకుని అతడిలో  ఆత్మవిశ్వాసం రాజుకునేటట్లు చేయగలిగావంటే అదృష్టవంతురాలివే. సుఖపడిపోతావ్.
అయితే తరచుగా అతణ్ణి నువ్వు వెన్ను తట్టి అతడిలో ఆత్మస్థయిర్యాన్ని మేల్కొలుపు తుండాలన్న సంగతిని మర్చిపోవద్దు.

దిక్కులు చూసే రామయ్య ! :


ఒక మనిషి కళ్ళు చికిలించి చంచలంగా అటూ ఇటూ చూస్తుంటే అతన్ని నెర్వస్ మనిషిగా, సందేహలరావుగా (లేక డౌటేశ్వరరావుగా ) అనుకోవాలి.
* బహుశా అతనికి జీవితం నేర్పిన పాఠాలు ఎవర్ని నమ్మవద్దని చెప్పి వుంటాయి. ప్రియురాలు గానో భార్యగానో ఎప్పుడూ నిన్ను ఒక కంట కనిపెట్టుకుని

ఉంటాదతను.మీ  మధ్య సంబంధం ఏమంత సజావుగా ఉండే అవకాశం లేదు.

కన్నుగోట్టే సోగ్గాడు:


* మరొక మరిడేశ్వరరావుంటాడు. ప్రారంభం నుంచీ నితో చలాకీగా కులాసాగా కబుర్లు చెపుతుంటాడు.సండుచుసుకుని కన్నుకొట్టి ' నువ్వంటే నాకసక్తి 'అన్న విషయాన్ని దాపరికం లేకుండా తెలియజేస్తుంటాడు.
* అతనితో పరిచయం పాకనపడ్డ కొద్ది అతని కన్నుకొట్టే  రహస్యమేమిటో నీకు తెలిసి వస్తుంది. బహుశ అతను ఆడవాళ్ళను వలలో వేసుకునే వేణు గోపాల స్వాముడన్నా అయి ఉండాలి.
* లేక నీతో మాట్లాడున్నపుడు నెర్వస్ నెస్ ని ఫీల్ అయి ఆ గాభరాలో గార్దభరావులా  అతనికి తెలియకుండానే అతని కన్ను అలాకొట్టుకుంటునన్నా ఉండాలి.

కనుబొమలు :

కళ్ళలాగే కనుబొమలు కూడా  అనేక సందర్భాలలో మన మనసులోపలి భావాలను తెలియజేస్తాయి. ఒక మనిషి కనుబొమలు ముడి పడ్డాయంటే అతను బాధ్యతా యుతమైన ఏవో ఆలోచనలలో ఉన్నాడని అనుకోవాలి.
* ముఖ లక్షణలో కనుబొమలు ముడిపడి ఉండటం ఒక భాగామయినపుడు -  అంటే అతడి కనుబొమలు హమేషా ముడిపడిన భంగిమలో ఉంటే - అతడు తాను పెళ్లాడబోయే లేక ప్రేమించబోయే స్త్రీని చాలా జాగ్రత్తగా ఎన్నుకునే వాడై ఉంటాడు. నిశితంగా, విశ్లేషణాత్మకంగా ఆమెను, పరిశీలిస్తుంటాడు. అతను రిలాక్స్ అయి ఉండే సందర్భాలు తక్కువ కాబట్టి అతనితో ఆమెకాపురం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది.

* అయితే అతనామెకు , ఆమెతో సంబంధానికి కట్టుబడి ఉంటాదనేది ఆశావహమైన విషయం.

* కనుబొమలు పైకి లేచి ఉండే పెద్దమనిషి గొప్ప ఆశావాది. ఈ ప్రపంచాన్ని ఎప్పుడూ విడ్డురంగా (వండర్ మే థండర్ అన్నట్లుగా) వీక్షిస్తుంటాడు. ఇతరులలో మంచి గుణాల్ని మెచ్చుకుంటాడు. కొత్త విషయాల్ని తెలుసుకోవాలనే తపనలో ఉంటాడు.

* ఎక్కువసేపు అతనలా కనుబొమలు పైకిలేపి ఉంచి నీవేపు చూస్తున్నాడంటే అతను నీ సౌదర్యం, తెలివి తేటల పట్ల మెచ్చుకోలుగా చుస్తున్నడనీ, తన ఆ మేచ్చుకోలుతనన్నీ నీకు తెలియజేయాలని  చూస్తున్నాడని అనుకోవచ్చు.

* ఒక  కనుబోమనుమాత్రమే పైకి లేపి చూసే మహానుభావుడు కాస్త మిస్ చీవియస్ మనిషనీ, దేనినీ,- ఆఖరికి స్త్రీ పురుష సంబంధాలని కూడా నమ్మడని అర్ధం చేసుకోవాలి. దేనిని నమ్మని నిశిత పరిశీలకుడతను.

* నీకతని వేడి వేడి చేదు భావాలూ వినోదాన్ని కలిగిస్తే బహుశ నీకతను ' విట్టీ' గా 'చామింగ్' గా కనిపించవచ్చు.