Facebook Twitter
చూపుల భాష్యం

చూపుల భాష్యం

- స్వప్న కంఠంనేని

 

 ప్రేమిస్తున్నానని నీ కళ్ళలోకి సూటిగా చూస్తాడా ?

లేడి కళ్ళ కూనా,
వలపులో  పడ్డావా పాపం !
ప్రిన్స్ చామింగ్ కనిపించాడా నీకు ?
అతనేలాంటివాడో
సరసుడో విరసుడో
వలపు బాణం వదలాలో వద్దో
టక్కరివాడో టక్కులమారాల వాడో-
ఆ బాణాన్ని తిరిగి నీకే వదిలి
నిన్ను బోల్తా కొట్టించాడు కదా !?
అని సందేహ పడుతున్నావా పాపం !
సతమతమవుతున్నావా పాపా ?

వేత చెందకు బేబి! కలలో కూడా నిన్ను కలవరపరుస్తున్న ఆ నలకూబరున్నీ
స్టడి చేయడానికి నీకు కొన్ని సూత్రాలు చెబుతాను...


మొహం నిండా నగ్న సత్యాలే!

  అందమనేది చర్మంలోతు మాత్రమేనంటారు విజ్ఞులు. కానీ ఆ చర్మం మీద ముఖ్యంగా మొహపు చర్మం మీద ఏర్పరిచిన ముద్రలు ఆ వ్యక్తి మనస్తత్వాన్ని తెలియజెప్పుతాయని చాలామందికి తెలియదు.పుట్టినప్పుడు పాపాయి మొహం అమాయకంగా పసిగా ఏ భావాలూ లేని నైర్మల్యంతో ఉంటుంది. కానీ వయసు గడిచిన కొద్ది ఆ మొహం మీద కొన్ని ముద్రలు ఏర్పడతాయి.ముఖ్యం గా టీనేజ్ ప్రారంభం నుండి యవ్వన పరిపూర్ణత సిద్ధించే దాకా ఉండే మధ్య కాలంలో.
 అంటే సుమారు పదమూడు నుంచి ఇరవైఒకటి సంవత్సరాల మనలో ఉద్వేగాలు మన ముఖకండరాలు రేఖల్లో మార్పులు తీసుకువచ్చి మన మొహపు రూపురేఖల్లో( వీటిని ఫీచర్స్ అంటాము) శాస్వత ముద్రలు ఏర్పరుస్తాయి.రూపురేఖలే మన గత జీవితానికి ' మ్యాప్' లాగాను,భవిష్యత్తుకు బ్లూ ప్రింట్ తో గాను ఉంటాయి.
మీరు ఒక మనిషి కళ్ళలోకి చూడండి. అతని పెదిమలు తిప్పే వంపుల్ని చూడండి నుదురు మీద పడ్డ గీతల్ని చూడండినవ్వే తీరును గమనించండి- అవి  అతడి మనస్తత్వం గురించి,ఆ సమయాన అతడి దృక్పధం గురించి  ఎంతో కొంత రహస్యాలు తెలియజెప్పకమానవ్ !
కాబట్టి బేబి, నువ్వు ఆకర్షణకు లోనవుతున్న, నువ్వు ప్రేమలో పడబోతున్న యువకుడి మొహాన్ని మొదట జాగ్రత్తగా గమనించు. గమనించి,అతడి  ముఖ భంగిమలు వ్యక్తీకరించే లక్షణాలను చదవడానికి ప్రయత్నించు.

* అతడు కళ్ళు విప్పార్చిచూస్తాడా,చూస్తాడా ?
* అతడు నేరుగా నీ కళ్ళలోకి చూస్తాడా లేక నీ చూపును తప్పించాలని చూస్తాడా
* అతడు మాట్లాడకుండా ఉన్నపుడు అతని పెదాలు గట్టిగా బిగుసుకుని ఉంటాయా లేక కొద్దిగా తెరుచుకుని ఉంటాయా ?
* అతని పెదిమల కొనలు పైకి తిరిగి ఉంటాయా లేక కిందికి వాలి ఉంటాయా
* అతని నోటి చుట్టూ నవ్వు గీతలు కనిపిస్తాయా లేక నుదుటి మీద కోపం గీతలు కనిపిస్తాయా?
* అతను పెద్దగా నోరు తెరచి నవ్వుతాడా లేక స్వల్పంగా పెదాల్ని కదల్చి నవ్వుతాడా?
* అతను నీతో మాట్లాడుతున్నపుడు అప్పుడప్పుడు మొహానికి చేతులు అడ్డం పెట్టుకుంటాడా ? అంటే మొహం తుడుచుకున్నట్లుగా...