Facebook Twitter
అవును వాళ్ళు క్షమిస్తారు 

   అవును వాళ్ళు క్షమిస్తారు 

 


పెద్ద గా కుయ్యి  కుయ్ మని   పెట్రోలింగ్ వాన్ పోలీస్ వాన్  వెనకే పోలీస్ జీపు పోలీస్ స్టేషన్ ముందు ఆగాయి సిఐ రాజారావు జీపు దిగి చకచకా నడుచుకుంటూ తన రూమ్ లోకి దారి తీసాడు.వెనకాలే దిగిన కానిస్టేబుల్స్ యాదగిరి ఆనంద్ నర్సింహ్మ రుక్మయ్య. పోలీస్ వాన్ లో ఉన్న ఆడా మగా అందరినీ దిగమని  వాళ్న ని మెట్టుకో తిట్టు తో స్వాగతాలుచెప్తున్నారు 


వెనకాలే కానిస్టేబుల్ ఆనంద్ వాన్ లో నుండి దిగిన వాళ్లందరినీ అదిలిస్తూ అందరూ దిగాకా "నడవండి !"ఏమి అడుగులు పడలేనంతగా పాటు పడ్డారా ! బొత్తిగా బరితెగించి తిరుగుతున్నారు ఛీ ఛీ మీవీ ఒక బ్రతుకులేనా ధూ! ఆంటూ ఒక్కక్కళ్లని
లాఠీతో కొట్టినంత పని చేస్తూ లోపలికి  తీసుకెళ్లి రైటర్ వీరాస్వామికి వాళ్లందరినీ చూపిస్తూ
"ఇదిగో సారూ ఈల్లందరి పేర్లు రాసుకో"అల్లదిగో! అక్కడ వెనకున్నారే" ఆ మూడు జంటలూ ఆళ్లంతా ఒకే ఫ్యామిలీ అంట


ఆల్ల పాపం ఇయ్యాల పండింది ఒకల్ల గుట్డు ఒకల్లకి బాగా అర్దమయపోయినాది.పెపంచం అందుకే ఇట్టా నాశనమయిపోయింది
ధూ" వీల్లవ్వ నాకే సిగ్గేస్తన్నాది.ఈళ్ల యవ్వారం చూస్తే" అని ఇంకా ఏదో అంటున్న
ఆనంద్ సిఐ గారు పిలత్తన్నారు" అంటూ వచ్చిన పానకాలు మాటకి ఎలర్టయి వెంటనే సిఐ రాజారావు రూమ్ కి వెళ్లాడు
రాజారావు "ఏంటి ఆనంద్ నీ పంచాయితీ అక్కడే మొదలెట్టావా! వాళ్ల గురించి ఏదీ వాగొద్దని చెప్పానా
మిగతా వాళ్లందరినీ వార్నింగ్ ఇచ్చి పంపించు  ఆ ఆనంద్ ని  కల్పన రమ్య ను  మాత్రం వేరే వేరే కూర్చోపెట్టు మీడియా వాళ్లనెవరినీ వాళ్లతో మాడ్లాడనీయద్దు ఒక అరగంట తర్వాత వాళ్లని తీసుకురా" ఈ లోగా వాళ్లేమయినా తింటారో త్రాగుతారో చూడు, మనకి  బాగా తెల్సున్న వాళ్లు ! అనిపర్స్ లోంచి అయిదొందలు తీసి ఇచ్చాడు

 

ఆనంద్ కి ఆశ్చర్యంగా ఉంది మనసులో""సిఐ సాబ్ కి తెల్సున్నవారే ఇలా పబ్లిక్ గా పార్క్ లో పచ్చిగా రొమాన్స్ చేస్తూ దొరికి పోవడం
""ఆయన్ని చూసి వాళ్ల కు షాక్ వాళ్లను  చూసి ఈన గారికి షాక్""దొరికిపోయిన పెద్దాయన ఒకాయన ఒకచిన్నామె మరో పెద్దామె ఒకళ్లను చూసి ఒకళ్లు బద్ద శత్రువుల్లా ఏదేదో ఇంగ్లీష్ లో తిట్టకుంటుంటే
‘అసలు వాళ్లంతా ఒకింట్లో వాళ్లో ఒకే యాపారమేమో! అదడిగితే సిఐ సాబ్ గరమయి "నీకెందుకో వెళ్లి పని చూడు!  అని చెప్పి ఆ ముగ్గరుని వేరే వేరే కూర్చో పెట్టాడు
పాపం బాగా పరేషాన్ అవుతున్నాడు సిఐ సాబ్ అనుకుని "సార్ ఛాయ్ తెమ్మంటారా ?అనడిగాడు


"సరే తీసుకురా" అంటూ కుర్చీలో వెనక్కి వాలాడు రాజారావు. అతనికిదంతా కలా నిజమా అన్న విభ్రమా కలుగుతోంది  కల్గిన షాక్ కి తనను తాను కంట్రోల్ చేసుకోవడానికే ఇలా ఒక అరగంట టైమ్ తీసుకున్నాడు
ప్రపంచం తగలడిపోయింది అని అందరూ అంటుంటే ఇంత తగలడిపోయింది అనుకోలేదు
‘రామ రామ మానవ సంబంధాలు ఇంత దిగజారి పోతున్నాయి. ‘ఇప్పుడెలాగ వాళ్లని ఏమనాలి?
ముందే చూస్తే ఎవరి దారిని వాళ్లని పొమ్మనేవాడు కాని వాన్ ఎక్కిస్తుంటే కాని చూడలేదు.నిండా ఇరవయ్యేళ్లు లేని రమ్య ఒక ఏభయ్యేళ్ల అంకుల్ తో రొమాన్స్! తన కళ్ల ముందు పెళ్లయిన తన. పక్కింటి ఫ్రెండ్ నలభై అయిదేళ్ల కల్పన. కి ఆమెకన్నా పదేళ్లు చిన్న వాడి తో ఎఫైర్ పట్టపగలు ఒక. రిస్సార్ట్ లో ఇలా తెగబడి పట్టుపడటం సిగ్గు తో తల వంచుకునేలా ఉంది.


ఇంక అ ఆనంద్ తన ఆఫీసు లో పనిచేసే అమ్మాయి అతని కన్నా కనీసం ఇరవయ్యేళ్ల చిన్నది అయుంటుంది. రకంగా బరితెగించి పట్టు బడటం ఆశ్చర్యం కలుగుతోంది ఒక వరసా వావి లేకుండా ఇలా సెక్స్ కోసం ఎక్కడెక్కడో తిరగడమేమిటి?
"ఛీ "ఛీ " అసలు అన్నిటి కన్నా బాధాకరమేమిటంటే  ఆనంద్ కల్పన మొగుడు.రమ్య కల్పన కూతురు ఇలా పట్టుబడటం ఒకెత్తు అవమానం.వాళ్ల గుట్టు రట్టు అయి సంసారం కూలిపోయిందన్న ఆక్రోశం వాళ్ల ముగ్గురిలోనుచోటు చేసుకుంది


ఇప్పుడెలా ? వీళ్ల సమస్యను ఎలా పరిష్కరించాలి?? నైతిక విలువలు బోధించాలా?సంసారం ఇంత దరిద్రంగా తగలెట్టుకున్నారని తిట్టాలా? ఒకళ్ల గురించి ఒకళ్లకి తెలిసిపోయాకాఎలా కలిసి కాపురం చేస్తారు ఆ రమ్య భవిష్యత్ ఏమవుతుంది?


ఇలా బుర్ర వేడెక్కి పోయి సతమతమవుతున్నరాజారావుకి టీ పట్టుకొచ్చి ఇస్తూ ఆళ్లని పిలమంటారా అనడిగాడు కానిస్టేబుల్ సరే పిలు మిగతా వాళ్లందరినీ ఛలాన్ కట్టించుకుని పంపించేసారా? అనడిగాడు "ఆ పనే చేస్తున్నారు ఎస్ ఐ బాలక్రిష్ణ గారు " అని జవాబిచ్చాడు ‘సరే వాళ్ల ముగ్గురు ని పంపు కాని నేను చెప్పేదాకా ఎవరినీ పంపొద్దు’ అన్నాడు రాజారావుదోమలు రాకుండా పెట్టిన మెష్ డోర్ తెరుచుకుని ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురూ లోపలకి వచ్చారు కల్పన ఆనంద్ రమ్య


రమ్య కల్పనమొహాలు బాగా ఏడ్చినట్లుగా కళ్లు మొహం వాచి ఉన్నాయి


రాజారావు ని చూసి మళ్లీ భోరుమంది కల్పన అది చూసి రమ్య కూడా ఏడ్వడం చూసి
"కూర్చోండి కల్పన గారు ఏడవకండి అసలు ఏమయిందో ఎందుకిలా జరిగిందో ఒకరి తర్వాత ఒకరుగా చెప్పండి" అంటూ ముగ్గురికీ తనెదరుగా ఉన్న కుర్చీలు చూపించాడు .కుర్చీ లో కూర్చుంటూ కల్పన వైపు అసహ్యంగా చూసి
"చేసేవన్ని చేసి ఇప్పుడు ఈ ఏడ్పులు దేనికి?ఆడాళ్లన్న విషయమే మర్చిపోయి బరితెగించిన ముండలు ఛీ " అన్న ఆనంద్ మాటలకు దెబ్బతిన్న నాగులా రోష కషాయితనేత్రాలతో’""నీ బండారం బయట పెట్టాలనే వచ్చాను
నేనొక్క దాన్ని వస్తే బాగుండదని తెలుసున్నతని సహాయం తీసుకున్నాను.’ కాని మీలా మీ కూతురు వయసున్న దాంతో కధలు నడపలేదు" అన్న కల్పన మాట పూర్తి కాకుండానే
"రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా! అన్నట్లు ఇంకా ఎలా బుకాయిస్తోందో "  అందుకే ఈ రమ్య ముండ కూడా నీలాగే తయారయింది  అయిపోయింది .మన కుటుంబం మర్యాద పరువు మంటకలిసి పోయాయి .ఇలా రిస్రార్ట్ వెంట తిరగండి ఈ బిజినెస్సే మంచిది మీలాంటి చెత్తముండలకి ""అన్న


ఆనంద్ మాటలు విని "చూడండి  మిస్టర్ ఆనంద్!ఇది మీ ఇల్లు కాదు మీరు అరవడానికి
మీరు సరిగ్గా ఉంటే మీకీ పరిస్తితి వచ్చేది కాదు .’కల్పన ఎటువంటిదో నాకు తెలుసు ఆమె కుటుంబం ఎంత ఉన్నతమైందో తెలుసు


ఆమె మొహం చూసి ఈ రోజు రమ్య ని మిమ్మల్ని ఈ మాత్రం గౌరవంగా చూస్తున్నాము లేకుంటే మీలాంటి బిజినెస్ మాగ్నెట్  పట్టుబడినందుకు మీడియాకి బోలెడు న్యూస్ !ఈ పాటికి మీ రాసలీలలు గురించి అన్ని న్యూస్ ఛానల్స్ లో వచ్చేది ‘ అని రాజారావు అంటే నేను మగాడ్ని! ఏదో ఆమె ఏదో కష్ట సుఖాలు చెప్పుకుంటానంటే ఇక్కడికి వచ్చాము అనుకోకుండా ""మీ రైడింగ్ జరిగింది మా ఖర్మ బాగోక మీ అందరికీ ఇలా దొరికాము"""అనంటున్బ ఆనంద్ ని ""బుకాయించకండి మీరు ఆమె ఎటువంటి పరిస్తితి లో పట్టుబడ్డారో !మా దగ్గర మా వాళ్లు తీసిన ఫొటోస్ ఉన్నాయి మీ ముగ్గురి లో మీరే అసభ్యంగా ఉన్నారు అని


"రమ్యా! నువ్వెందుకమ్మా! ఇలా వచ్చావు నీకెంతో భవిష్యత్ ఉంది ఇలా పిచ్చి స్నేహాలు చేసి ఇలా అల్లరిపాలు అయితే అసలు తలెత్తుకు తిరగ్గలవా? అదృష్టవశాత్తు మేము కాబట్టి సరి పోయిందివేరే ఎవరి చేతికి చిక్కినా ఏమయ్యెది?అని అంటున్న రాజారావు మాటలకి ""లేదంకుల్ మా అమ్మ కి నాకుతెలిసింది మా నాన్న ఈ రోజు నాన్న వాళ్ల ఆఫీసు కొలీగ్ తో ఇక్కడికి వస్తున్నాడని, ""ఆయన ఫోన్ మేము చెక్ చేస్తూనే ఉంటాము .అప్పుడప్పుడు


""అలాగే మార్నింగ్ చూస్తే వాట్సప్ మెసేజ్ లో వీళ్ల ప్రోగ్రామ్ వివరాలు చదివి అమ్మకు చెప్పాను.
"అమ్మ ఫ్రెండ్ కొడుకు రాజేష్ హెల్ప్ తీసుకుని ఇక్కడికి వచ్చి రెడ్ హేండ్ డ్ గా వాళ్లను పట్టాలని వచ్చింది.
""నేను కాలేజ్ కి వెళ్లి మా ఫ్రెండ్
నిమ్మీని తీసుకుని వస్తానని అమ్మకు మెసేజ్ చేసాను" కావాలంటే అమ్మ ఫోన్లో నాన్న ప్రొగ్రామ్ వివరాలు ఫార్వర్డ్ చేసిన టైమ్ నేను వస్తున్నాను!" అని పెట్టిన మెసేజ్ ల టైమ్ చూడండి!""ఈ రిస్సార్ట్ దూరం అని నిమ్మీ నేను వాళ్ల నాన్న కారులో వచ్చాము అమ్మా వాళ్ల కోసం వెతుకుతూ మేను ముగ్గురం తిరుగుతుండగా మీ వాళ్లు మమ్మల్ని బలవంతంగా వాన్ ఎక్కించారు!
""మాకోసం వెయిట్ చేస్తున్నఅమ్మ రాజేష్ ని కూడా  మేమెంత చెప్తున్నా  వినకుండా ఎన్ని మాటలన్నారో! అని చెప్తూనే భోరున ఏడ్చిన రమ్యను పట్టుకుని కల్పన కూడా ఏడ్వటం చూసి రాజారావు మనసు ద్రవించింది


అసలు కారణం విన్న ఆనంద్ పట్టుబడిన దొంగలా గుటకలు మింగుతున్నాడు .అది చూసి రాజారావు " చూడవయ్యా నీ వల్ల వీళ్లిద్దరి జీవితాలు ఏమయ్యాయో! నీ విచ్చలవిడి జీవితం గురించి మా అందరికీ ఎపుడో తెలుసు
కాని వీళ్లిద్దరూ కూడా ఇలా విడి విడి గా రైడింగ్ లో దొరికితే ఎంత తల్లడిల్లానో!
బంగారమంటి కాపురం ఇలా బుగ్గిపాలు అయిందేమిటి?  ఈ సొసైటీ ఇంత దిగజారిపోయిందేమిటి అని ఆవేదన పడ్డాను
కాని కల్పన వ్యక్తిత్వం మీద నేను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. అలాగే రమ్య కి కూడా ఆమె పెంపకంలో తల్లి తరపున నిలబడేంత పరిణతి ఉంది నీ మూలంగా వాళ్లు రాకూడని ప్లేస్ కివచ్చి భయంకరమయిన పరిస్తితి లో ఇరుక్కున్నారు.వాళ్లేమిటో నా ఒక్కడికే తెలుసు కాని మా సిబ్బంది మీ అందరినీ కలిపి ఎంత నీచంగా మాట్లాడారు తాటి చెట్టు క్రింద కూర్చుని పాలు త్రాగినా కల్లు అనే అనుకుంటారు


ఈ నిజం వాళ్లకి చెప్తే నమ్ముతారా? చెయ్యని నేరానికి శిక్ష అనుభవించేలా చేసావు నీ ఇల్లాలు కి కూతురికి ఒక ఇంటి యజమానిగా ఇదేనా  వాళ్లకి నువ్వు ఇచ్చిన భద్రత సిగ్గుండాలి " అని గట్టిగా అన్న రాజారావు మాటలకు "అసలు మెసేజ్ చూసాకే నిలదీయాల్సిందిగా ఇక్కడెవరికి రమ్మన్నారు?


అయినా వాళ్లకి ఏ లోటు చేసాను ఏదో నా ఆనందం కోసం రిలాక్సేషన్ కోసం నన్ను కోరుకునే వాళ్ల తో ఎంజాయ్ చేస్తే తప్పేంటి? మగాళ్లెవరూ చేయరా! అని సమర్ధించుకుంటున్న ఆనంద్ మొహం మీద కొట్టాలన్నంత ఆవేశం తో సీటు లోనుండి లేచాడు రాజారావు మళ్లీ తమాయించుకుని ఆనంద్ కి కోపంగా తర్జని చూపిస్తూ "  యూ స్టుపిడ్! నైతిక విలువలు మంట కలిపి  భార్య కు అన్యాయం చేసి కూడా ఇంకా సమర్ధించుకుంటున్నావా! ఇడియట్!" తనయుడు చెడితే తండ్రి తప్పుతనయ చెడితే తల్లి తప్పు  భార్య చెడితే భర్త తప్పు " అలా కుటుంబం పాడయింది అంటే ఇంటి యజమాని తప్పు" నీ మీద నిఘా పెట్టేంత గా నువ్వుండబట్టే ఇంట్లో పరువుగా ఉండాల్సిన ఆడాళ్లు ఇలా పోలీస్ స్టేషన్ కి రావాల్సి వచ్చింది.ఇప్పటికయినా మీరు మారకపోతే నష్టపోయేది మీరే! ఇప్పటికయినా ఇలాంటి పిచ్చి తిరుగుళ్లు మాని కల్పన ని రమ్యని బాగా చూసుకుంటారా మీ రాసలీల లు మీడియాకి ఇచ్చేయమంటారా?సూటిగా అడిగాడు రాజారావు.


ఆ మాటకు కంగారు పడి" నో నో! అంత పని చేయకండి సార్ ప్లీజ్  నేను తప్పే చేసాను కాని
అదే తప్పు నా భార్య కూతురు కూడా చేసారనేసరికి నా కంట్రోల్ తప్పి మాట్లాడాను
ఇలాంటి పరిస్తితి ఎవరికీ రాకూడదు.. నా అలవాట్లు మానుకుంటాను ప్లీజ్ "అన్నాడు ఆనంద్ ఆ విషయం నాకు కాదు మీ భార్య కు కూతురికి చెప్పుకోండి వాళ్లు ఒప్పుకుంటే మీరు అల్లరి కారు.అధర్ వైజ్ మా ఏక్షన్ మేము స్టార్ట్ చేస్తాము.’.అని కల్పనా మీరు రమ్య ఇదంతా ఒక పీడకలగా మర్చిపోండి! మీకు నా హెల్ప్ ఎప్పడూ ఉంటుంది
పక్క రూమ్ కి వెళ్లండి అక్కడ మీ  ఆయనతీ మాట్లాడాక మీ నిర్ణయంచెప్పండి.అన్నాడు టేబిల్ మీద ఉన్న బెల్ కొడ్తూ వెంటనే లోనికి వచ్చిన కానిస్టేబుల్ యాదగిరిని వీళ్లని కౌన్సిలింగ్ రూమ్ లో కూర్చో పెట్టు!మేడమ్ చెప్పాక మళ్లీ ఇక్కడికి తీసుకురా! అన్నాడు దర్పంగా కల్పన రెండు చేతులు జోడించింది. కృతజ్ఞతభావం ఆనె గుండె నిండా నిండి కన్నుల లోప్రతిఫలించింది 

గద్గదమయిన స్వరంతో" ""మీ మేలు ఎప్పటికీ మరువలేను రాజారావు గారు" అంది కుర్చీ లోంచి లేస్తూ రమ్య కూడా తల్లిని అనుసరిస్తూ ఇంచుమించుగా  ఏడుస్తూ " నాకు మాటలు రావటం లేదు సర్ పోలీసులు అంటేనాకెంతో భయం! కాని ‘మీడ్యూటీలో మానవత్వం నిండి ఉంది’ ధాంక్యూ వెరీమచ్ సర్ !అంది


వారిద్దరి వెనకే తను కూడా వెడ్తూ ""సారీ సర్ !అన్న ఆనంద్ ని ""ఇవన్నీ వాళ్లకు చెప్పండి!"వాళ్లకు మీ మీద నమ్మకం కల్గించుకోండి !
అన్నాడు రాజారావు వెడ్తున్న వాళ్లను చూసి నవ్వుకున్నాడు
ఎందుకంటే అతనికి వాళ్ల మాటల రిజల్ట్ తెలుసు! ఎన్నో కేసుల్లోలాగానే ఈ కేసులో కూఢా మగాడు( మొగుడు) క్షమింపబడతాడు అవును వాళ్లు క్షమిస్తారు.
                                                                            
 

 

రచన: కామేశ్వరి చెంగల్వల