Facebook Twitter
దిశమారిన లక్ష్యం

దిశమారిన లక్ష్యం

జి. సురేఖ

"ఎలా ఉంది, పెద్దమ్మ?" అని నెమ్మదిగా చేయి నిమురుతూ అడిగాను, అప్పుడే నిద్రలొనుంచి మేల్కంటున్న పెద్దమ్మని.

తల తిప్పి నా వైపు చూసి, "ఎంత సేపైంది వచ్చి?" అంది చాలా నీరసంగ.

"ఎంతొ సెపు కాలెదు, ఇప్పుడే." అన్నాను నేను, బైపాస్స్ సర్జరి (bypass surgery) నుంచి తేరుకుంటూ కూడ నన్ను గుర్తు పట్టినందుకు సంతొషపడుతూ.

"నువ్వు ఒక్కతే వచ్చావా?" అంది గది నలుమూలల చూస్తూ. ఫెద్దమ్మ కళ్ళు ఎవరికోసం వెతుకుతున్నాయన్నది అర్ధమౌతొంది.

"అమ్మ కూడా వచ్చింది, పెద్దమ్మ. బాత్రూంకి వెళ్ళొస్తానని, ఇందాకే అటెళ్ళింది." అన్నాను.

"విక్రం, పిల్లలు బగున్నారా..." అంటూ పెద్దమ్మ అడుగుతూ ఉండగా అమ్మ, మా వారు, పిల్లలు బిల బిలమంటూ గదిలోకి వచ్చారు. అమ్మ వచ్చి, వాళ్ళ అక్క ప్రక్కనే హొస్పిటల్ బెడ్ కూర్చుంటూ, "ఇప్పుడే జ్యొతి తొ మాట్లాడోస్తున్న. ఆపరేషను బాగా జరిగింది అని అంది. నువ్వేమిటి, వేళకు సరిగ్గా మందులు వెసుకోవట్లేదంట?" అంది.

"నేను ఆ మందులు వేసుకొని, బ్రతికుండి ఇంకా ఏం వినాలి, రాజ్యం...." అంటూ పెద్దమ్మ కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని మా వైపు చూసింది.

చెల్లెలతొ మనసులోని మాట చెప్పుకోవలనే ఆత్రుత పెద్దమ్మ కళ్ళలో చూసి, నేను వెంటనే, "ఏవండి, నేను జ్యొతక్కతొ మాట్లాడాలి. మీరు పిల్లలని Sai Baba Space Center కి తీసుకెళ్లండి." అంటూ గదిలొ నుండి బయటికి వచ్చి, జ్యొతక్క రూం వైపు వెళ్ళా.

***** ********** ******** ********** ********

జ్యొతక్క మా పెద్దమ్మ కూతురే. ఇంచు మించు ఇరవైరెండు సంవత్సరాలు అమెరికా లొ Cardiologist గా పనిచెసి, ఈ మధ్యే, అంటే ఏడు నెలలు క్రితం పుటపర్తికి వచ్చి, Satya Saibaba Super Speciality Hospital లొ పని చేస్తొంది. మా బావగారు Cardio Thorasic Surgeon.

అక్కకి ఇద్దరు పిల్లలు - పవన్, ప్రతిమ. పవన్ డాక్టరు, చక్కగ పెద్దలు చూసిన అమ్మాయిని క్రితం ఏడాద పెళ్ళి చేసుకున్నాడు. ప్రతిమ ఈ మధ్యనే లా కొర్సు పూర్తి చెసింది. మా వారికి అమెరికాలో ఉద్యొగం ఆఫర్ వచ్చినప్పటి నుండి అనుకుంటున్నా పెద్దమ్మని, అక్కని అమెరికాకి వెళ్ళే ముందు చూసి వెళదామని.

కాని ఐదు రూజులు క్రితం పెద్దమ్మకి హార్ట్ అటాక్ వచ్చి బైపాస్ సర్జరీ చేయడంతొ, ఈ వాళ అమ్మని తీసుకొని హైదరబాదు నుంచి వచ్చా.

***** ********** ******** ********** ********

Dr. Jyothi Rao, MD (USA), Cardiologist అన్న చిన్న నేంప్లేట్ (nameplate) తలుపు పైన చూసి, నెమ్మెదిగా తలుపు పైన తట్టాను.

"కమిన్ (come in)" అని అక్క గొంతు వినిపించింది.

తలుపు తీసుకొని లోపలికి వెళ్ళా. పేపర్లేవో సంతకం చేస్తూ తల ఎత్తి నా వైపు చూసి, "నువ్వా అమృత. రా, రా." అంటూ పేపర్లు నర్సుకి ఇచ్చి, " రూమ్  203 లొ ఉన్న పేషెంట్ని మధ్యాహ్నం ఇంటికి పంపిచేద్దాము. పేపర్ వర్కంతా పూర్తి చేసి నాకు చెప్పమ్మ." అని ఆవిడ్ని పంపేసింది.

క్రితం సంవత్సరం, పవన్ పెళ్ళిలొ చూసినప్పటికంటె ఇప్పుడు బాగా సన్నబడినట్లు కనిపిస్తొంది అక్క. యాబైఐదు  సంవత్సరాలు దాటినా వయసులో చాలా చిన్నగా వుండి తన పిల్లలకి అక్క లాగ ఉంటుందని మేమందరము అనుకుంటూ ఉంటాము ఎప్పుడు.

అలాంటిది, ఒక్క ఏడాదిలొనే పది సంవత్సరాలు పైబడట్టు కనిపిస్తోంది. "ఈ రోజు ప్రొద్దున్నె రెండు యాంజియోగ్రాంస్ (angiograms) వుంటె తొందరగ హస్పిటల్కి వచ్చెసా. వంటావిడకి చెప్పొచ్చా, బ్రెక్ఫాస్ట్ చేసిపెట్టిందా?" అంది.

"అందరమూ బ్రేక్ఫాస్ట్ చేసామక్క. పెద్దమ్మకి పర్వాలేదా?" సంశయిస్తూ అడిగా. "సర్జరీ బాగా జరిగింది. అమ్మ డైబీటిక్ (diabetic) కదా, అందుకని ఐదు రోజులు అబ్సెర్వేషన్లొ (observation) ఉంచాను. ఆవునూ, మీ అమెరికా ప్రయణం ఎప్పుడు?" అంది.

"రెండు నెలలు తరువాత బయలుదేరాలి . ఈ లోపుల పిల్లల్ని అమ్మా వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్న స్కూల్లో చేర్చాలి" అన్నాను.

"అదేంటి, పిల్లలని తీసుకెళ్ళావా  నీతొ ? వీసా రాలేదా వాళ్ళకి?" అంది అక్క .

"వీసాతో ఏమీ సమస్య కాదక్క. నేను మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ స్టడీస్ కి అప్లై చేసాను. అది పద్దెనిమిద నెలలో అయిపోతుంది. ఆ తరువాత పిల్లల్ని తీసుకేళదామని అనుకుంటున్న."  అన్నాను చాలా ఉత్సాహంగా.

ఎందుకంటే, మా అందరి ఆడపిల్లల్లో జ్యోతక్కే పెద్దది. అమ్మాయులు బాగా చదువుకొని, వారి కాళ్ల మీద నిలబడాలి అని ఎప్పుడు చెబుతూ ఉంటుంది. అక్క చటుక్కున లేచి, వెళ్లి తలుపు మూసి గొళ్ళెము పెట్టి వచ్చి నా ప్రక్కన కూర్చొని "అమృత , పిల్లలని నీతో తీసుకొని వెళ్ళు . వాళ్ళు అక్కడ స్కూలుకి అలావాటు పడ్డాక నువ్వు నెమ్మదిగా చదువుకోవచ్చు." అంది.

అక్కేనా ఈ మాట అంది అని ఆశ్చర్య పోయి "అలా చేస్తే ఎప్పటికో అక్క నా కోర్స్ అయ్యేది " అన్నాను "ఎప్పటికైనా పర్వాలేదు, అమృత.

ఇరవైరెండు సంవత్సరాలు క్రితం నేను చేసిన తప్పును నువ్వు చేయదమ్మ. పవన్, ప్రతిమ పుట్టాక ఇద్దరినీ అమ్మ దగ్గర వదిలేసి నేను మీ బావ దావానగిరిలో PG కోర్స్ చెయ్యడానికి వెళ్ళిపోయాము. కాని మీ బావ వాళ్ళ అక్క అమెరికాలో బాగా డబ్బులు సంపాదిస్తోందని విని , మళ్ళీ  ECFMG పరీక్ష వ్రాసి, అమ్మ దగ్గర పిల్లలని ఉంచి,  US కి రెసిడెన్సీ చెయ్యడానికి వెళ్ళాము.

మేము ఇద్దరమూ రెసిడెన్సీ పూర్తి చేసేసరికి పవన్ కి పన్నిండు ఏళ్ళు, ప్రతిమకి తొమిది వచ్చాయి. పిల్లలు మా దగ్గరకి వచ్చాక మీ బావకు కాని నాకు కాని వాళ్ళతో గడపడానికి టైం వుండేది కాదు. ఇద్దరవీ చాలా బిజీ ప్ర్యాక్టీసులే.

అప్పుడు, తల్లిగా వాళ్లకి అన్ని చేసాననే అనుకున్నాను. మంచి ప్రైవేటు స్కూల్స్ లో వేసాను, టెన్నిస్ కోచింగ్ ఇప్పించాను, సమ్మర్ కాంపస్ కి, స్కీయింగ్ ట్రిప్స్ కీ పంపాను , వాళ్లు అడిగినది ఏది కాదనలేదు .

ముఖ్యంగా, పవన్ మంచి మార్క్స్ తెచ్చుకునేవాడు. వాడు నా లాగ బ్రిలియంట్ అని నా స్నేహితులు అంటూ ఉంటే , నేను చాలా గర్వపడ్డాను ."

"మరి ఇద్దరు బాగా చదువుకొని పైకొచ్చారు కాదక్కా ?" అన్నాను .

"అవును, ఒకరు డాక్టరు ఒకరు లాయరు అయ్యారు, కాని మంచి మనుషులుగా ఎదగలేదు. నేనన్నామీ బావన్నా ఇద్దరికీ గౌరవము అస్సలు లేదు." అంది బాధగా.

"అదేంటక్క, పవన్ మీరు చెప్పిన పిల్లనే చక్కగా పెళ్లి చేసుకున్నాడు కదా?" అన్నాను నాకు అర్థం కాక. "అక్కడే వాడు అందరిని మోసం చేసాడు, అమృత.

మేము చేసిన అమ్మాయి డాక్టర్, అందమైనది, ఆస్తి బాగా ఉంది. అందుకే చేసుకున్నాడు. పెళ్లి అయిన రెండు వారాలకే, వాడికి అన్ని దురలవాట్లు వున్నాయని ఆ అమ్మాయి తెలుసుకొంది. అలవాట్లు మానుకోమని వాడిని బ్రతిమిలాడుకోంది. నేనూ ఎంతో చెప్పి చూసాను వాడికి, కాని వాడు తను చేసేది ఏదీ తప్పే కాదన్నట్లు మాట్లాడాడు. ఆ అమ్మాయి డివోర్స్ కి ఫైల్ చేసింది."

"ఎప్పుడు జరిగిందక్క ఇదంతా?" అని అడిగాను నివ్వెరపోయి.

“ఏడు నెలలు క్రితం. మీ బావ కోపం నీకు తెలుసుగా. వాడి ప్రవర్తన చూసి, ఆయన బాగా అరిచారు. మాట మాట పెరిగి, వాడు మీతో నాకేమీ సంబంధం లేదని వెళ్ళిపోయాడు. ఒక మూడు వారాలు తరువాత ఆస్తి కోసం లాయర్ నోటిస్ పంపాడు మా ఇద్దరికీ ..." అంటూ కన్నీరు పెట్టుకుంది.

నాకేం చెప్పాలో తెలియక అక్క వీపు నిమురుతూ కూర్చున్న. కాసేపటికి తెపరాయించుకొని, "ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా అమృత? తల్లిగా నా భాద్యతని నేను విస్మరించానని అప్పుడు తెలియలేదు. పిల్లలు చదువులో, ఆటల్లో రాణిస్తూ ఉంటే, మురిసిపోయనే కాని, వారి మనోభావాలు ఎలా ఉన్నాయి అని తెలసుకోవాడానికి సమయము కేటాయించలేక పోయాను. ఆడవారు ఉన్నత చదువులు చదువుకోవాలి, స్వతంత్రంగా బ్రతకాలి అని మెడిసిన్ లో చేరాను. ప్ర్యాక్టీస్ బాగా జరగాలని PG చేసాను, మన దేశంకంటే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చని, అమెరికా భూలోక స్వర్గమని మీ బావని ఒప్పించి మరి us కి వెళ్ళాను.

వెళ్ళినప్పటి నుండి హోస్పిటల్లోనే బ్రతికాను. సంపద పెరిగే కొద్ది ఇంకా సంపాదించాలి అనే వ్యామోహం పెరిగింది. దానికి స్త్రీ స్వాతంత్రం అనే ముసుగు వేసి నన్ను నేను మభ్య పెట్టుకున్నాను. పవన్ లాయర నోటిస్ అందిన రోజు కను విప్పు కలిగింది నాకు." అంది.

"ప్రతిమ ఏమంటోంది ఇదంతా జరిగాక?" అన్నాను "లాయరు కదా, మంచి లయరిని వెతికిపెట్టి వాళ్ళ అన్నకి సహాయం చేసింది." అంటూ అక్క కళ్ళ నీళ్ళు తుడుచుకోంది.

అక్క బాధని చూసి, ఏ తల్లికి ఈ పరిస్తితి రాకూడదు భగవంతుడా అని అనుకున్న. "పిల్లలది ఏమీ తప్పు లేదు, అమృత. ‘Apple does not fall far from the tree’ అని అంటారు. బ్రాండ్ నేమ్ (brandname) బట్టలు, హైఎండ్ కార్లు (high-end cars) ఇస్తేనే ప్రేమని అనుకుంటున్నాడు వాడు. నిజమైన ప్రేమని కొనే ధనం  లేదు ఈ లోకంలో అని పిల్లలికి తెలిసేలా నేను నడుచోకోలేదు. ఇది తెలుసుకోనేసరికి పిల్లలిద్దురూ చేయిజారి పోయారు. ఆకాశమంత ఎత్తు ఎదిగి, నక్షత్రాలను తాకాలని ఆశించాను కాని, నా జీవితంలో ఉన్న హృదయాలను తాకలేక పోయాను. తల్లిగా ఓడి పోయాను, అమృత..." అంటూ ముఖము చేతుల్లో దాచుకుంది అక్క.

తలుపు తడుతున్న చప్పుడు విని , కళ్ళ నీళ్ళు తుడుచుకొని , గొంతు సవరించుకొని, "కమిన్" అంది అక్క.

నర్స్ వచ్చి , "రూమ్ 203 లో ఉన్న పేషంట్ ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, డాక్టర్" అంది. ఇప్పుడే వస్తా నంటూ అక్క లేచి వెళ్ళింది.

పిల్లల్ని మాతోపాటు అమెరికా తీసుకెళ్లాలని వెంటనే నిర్ణయుంచుకున్నను. ఈ విషయమే మా వారితో మాట్లాడాలని రూమ్ బయటకి వస్తూంటె, మరి బావ ఎందుకు అక్కతో ఇక్కడికి రాలేదు అన్న  సందేహం వచ్చింది.