Facebook Twitter
" ఏడు రోజులు " పార్ట్ -1

" ఏడు రోజులు " పార్ట్ -1

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

 

 

*ఆదివారం

 భాగ్యనగర శివారులో వున్న మైసమ్మ గుడిదగ్గర కుర్చుని వున్నారా ఇద్దరు యువతీయువకులూ .
  ఆమె పేరు గౌసియా బేగం .పద్దెనిమిదేళ్ళ వయసులో ఉంది .
  అతని పేరు భవాని శంకర్ . ఇరవై ఏళ్ళ వయసులో వున్నాడు .
ఇద్దరి వాదనల్లోను ఆందోళన స్పష్టంగా కనబడుతోంది.
"శంకర్ ! ఇప్పుడేం చేద్దాం?" అడిగిందామె.
"ఎక్కడికైనా వెళ్ళిపోదాం " చెప్పాడు అతను.
"వెళ్ళి ఎలా బతకగలం?"
"కూలిపని చేసుకుందాం "
"అల్లా!"నొచ్చుకుందామె.
"అంతకంటే మార్గంలేదు "
"మరి ఎప్పుడు వెళ్ళిపోదాం? "
  "వచ్చే శుక్రవారం"
"వద్దు... రేపే వెళ్ళిపోదాం "
"అంత త్వరగా ఎలా వేళ్ళిపోగలం?వెళ్ళాలంటే చేతిలో కొద్దోగొప్పో డబ్బు వుండాలి. ఈ శుక్రవారం నాటికి మా పప్పాకి జీతం వస్తుంది. నేను

సగం డబ్బు ఎత్తుకుని వచ్చేస్తాను"
 "ప్చ్" బాధగా నిట్టూర్చింది గౌసియ .
 ఆమె బాధ అతడికి తెలుసు. అందుకే ప్రేమగా ఆమె తల నిమురుతూ అన్నాడు, "నేను డబ్బు కాజేస్తే మా ఇంట్లో కష్టాలు ఎదురౌతాయని

నాకు తెలుసు. పప్పా కష్టపడడం నాకు ఇష్టంలేదు. అలాగని వూరుకుంటే మనం వెళ్ళలేం. అప్పుడు నీ పరిస్థితి మరీ దారుణంగా వుంటుంది.

అందుకే అన్నివిధాలుగా గుండె దిటవు చేసుకుందాం "
"సరేకానీ ఒక విషయంలో మనం జాగ్రత్త వహించాలి"అందామె.
 "ఇల్లు వదిలిన తర్వాత మనం ఈ హైద్రాబాద్ లో వుండోద్దు.అస్సలు ఈ రాష్టంలోనే వుండోద్దు ఎందుకైనా మంచిది వేరే రాష్టానికి వెళ్ళిపోదాం.

అక్కడైతే మన ఆచూకీ ఎవరికీ తెలీదు"
"మంచి ఆలోచనే! కానీ మనం అలా వెళ్ళాలి అంటే నేను తీసుకువచ్చే డబ్బు ఎందుకూ సరిపోదు"  "ఎలా గోలా వెళ్దాం"
"ఎలా వెళ్ళగలం? "
 ఆమె ఆలోచనగా వుండిపోయింది. అతడు కూడా ఆలోచించసాగాడు. కాసేపటి తర్వాత ఆమె అంది.
"శంకర్! ఒక మంచి అలోచన"
"ఏంమిటి? " అన్నట్టుగా చూశాడు అతడు.
"రైలు ఎక్కి ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోదాం "
"మద్యలో టిక్కెట్కలెక్టర్ వస్తే, మన దగ్గరున్న డబ్బుని మొంత్తం జరిమానా కిందికిలగేసుకుంటాడు. అప్పుడు మన పరిస్థితి ఏమిటి? "
"అది నిజమే..."
"అందుకే మొదట మనం ఏ మరుమూలకో వెళ్ళిపోదాం "
 "సరే"
 తర్వాత అతడేం మాట్లాడలేదు. ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆమె నుదుటిపై మృదువుగా చుంబించాడు. ఆమె పరవశంగా కళ్ళు

మూసుకుంది.
 "ఇక వెళ్ళిపోదామా? " అతడు ముద్దు పెట్టుకున్న తర్వాత అడిగింది.
 "కాసేపు వుందాం "చెప్పాడు.
  నేను వెళ్లే సమయం అయింది. ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం" భయంగా అంది.
 ఆమెను అతడు అర్ధంచేసుకుని ఆమె చేయి పట్టుకొని ఆమెతో పాటుగా లేచి నిలబడ్డాడు. ఇద్దరూ మైసమ్మ దేవతకి దణ్ణం పెట్టుకున్నారు.
 "దేవత మనల్ని తప్పకుండా కరుణిస్తుంది"వెళ్ళబోతూ చెప్పాడు అతడు.
 "అ నమ్మకం నాక్కూడా వుంది" అంటూ తలమీది బురఖాను సరి చేసుకుంది గౌసియా.
 తర్వాత ఇద్దరూ కలిసి కొద్దిదూరం ముందుకు నడిచారు. అరకొర ఇళ్ళతో నగరం ఆరంభమయింది. అక్కడ ఇద్దరూ విడిపోయారు. ఆమె

ఎడమవైపుగా వున్న దారివెంబడి నడిచి వెళ్ళింది. అతడు కుదిపక్కగావున్న దారివెంబడి వెళ్ళిపోయాడు.

  *సోమవారం*

  రెండు చిన్నగదులు పెంకుటిల్లు ఇంట్లోవున్న గుమ్మలకి, కిటికీలకి, అల్మరాలకి, పాత చీరలతో కుట్టిన పరదాలు వేలాడదదీసి వున్నాయి.

వంటింట్లో పింగాణి వస్తువులు ఎక్కువగా వున్నాయి. ఒక పద్ధతి ప్రకారంకాకుండాచిందరవందరగా అమర్చిన సామాను ఇంటిని మరీ ఇరుకుగా

చుపెడుతోంది. గోడలకి నిండుగా వేలడదదీసిన 'అల్లా'ని సూచించే కేలండర్ లు కొన్ని పాతబడి వున్నాయి. తోడుగా పెచ్చులు ఊడినగోడలు

పేదరికాన్ని భుతద్దంలోంచి చిపిస్తున్నట్లుగా వున్నాయి.
 నడి ఇంట్లో పరిచిన గోనేతట్టుమీద్ద సుమారుగా  ఐదు కిలోల మల్లెపుల్లు రాసిపోసి వున్నాయి వాటిచుట్టు కుర్చుని వేగంగా మాలలు

అల్లుతున్నారా తల్లీ, ఆరుగులు ఆడపిల్లలూ. ఇంకో ఆడపిల్ల మరీ చిన్నది కావడంతో తల్లి పక్కలోనే కూర్చుని ముతకబట్టలతో తయారుచేసిన

బొమ్మలతో ఆడుకుంటోంది. మరోపిల్ల తల్లిపాలు తాగుతోంది. కాగా ఆ తల్లి మళ్ళి కడుపుతో వుంది.
 మాలలు అల్లుతున్న పిల్లల్లో అందరికంటే పెద్దదైన గౌసియా బేగం, ఒకవైపు మల అల్లుతూనే, మరోవైపు కొద్దిగా తొలగిన పరదా చాటునుండి

ఎదురింటివైపు చూస్తోంది.
 ఒక మోస్తరుగా వున్న ఎదురింటి ముందు రెండు అరుగులు వున్నాయి. అవి జాజుతో ఎర్రగా అలికి ముగ్గులతో పొందికగా అలంకరించి

వున్నాయి అందులో ఒక అరుగుమీద కూర్చుని వున్నాడు భావానీశంకర్. అతడి చూపులు పెంకుటింటివైపే వున్నాయి. అయితే అతడు

వెలుగులో కూర్చుని ఉన్నందున, ఇంట్లో పరదాచాటున కానీకనిపించక కూర్చుని వున్నగౌసియా బేగం అతడికి కనబడటంలేదు.
 "రేయ్ ... శంకరూ"ఇంట్లో తిరిగాలి విసురుతున్న అతడిని తల్లి లక్ష్మిదేవమ్మ పిలిచింది.
 "ఆ" కళ్ళలో ప్రియురాలిని వెతుకుతూనే పలికాడు.
 "బయట కూర్చుని ఏంచేస్తున్నావురా? "అడిగిందామె.
 "ఏం చేయాలి? "
 ఇల్లంతా సాలీడు గూళ్ళతో నిండిపోయివుంది. కస్తాకర్ర తీసుకుని దులపరాడు? "
 "నేనేమైనా ఆడపిల్లనా? "
 "నాకు ఆడపిల్లవైనా మగపిల్లాడివైనా నేవ్వేకదరా! అయినా ఇంటిపని చేసుకోవడంలో తప్పులేదు కానీ, అదొక్క సాయంచేసిపెట్టు"
 "పొమ్మా" అతడి గొంతులో నిర్లక్ష్యం.
 "కాస్త చెప్పినమాట వినరా" ఆమె గొంతులో అభ్యర్ధన.
 "నేను అలాంటి పనులు చేస్తే నా స్నేహితులు ముందు తక్కువైపోనూ? మగాడివై ఆడంగి పనులు చేస్తున్నావేంట్రా అని వాళ్ళు నన్ను హేళన

చేస్తుంటే నేను ఎలా తలెత్తుకోవాలి? " అంటూనే అరుగుమీద నుండి లేచి లోపలికి నడిచాడు భావనీశంకర్.
 "ఈమాటమాట్లాడ్డానికి నీకు సిగ్గు, శరం వుడాలి"అంటూనే తిరగాలి విసరడం ఆపిందామె.
 "నీ స్నేహితులంతా చదువుకున్నారు కాబట్టి వాళ్ళతో నీకు పోటీ తగదు అంటావు, అంతేకదా" రోషంగా అన్నాడు అతడు.
 "లేకపోతే ఏంట్రా? నీ స్నేహితులంతా డిగ్రీలో వున్నారు. నువ్వేమో పదవతరగతి పాసవ్వడానికే నానాతంటాలు పడుతున్నావు. మీ పప్పాకి

అసలే ఆరోగ్యం బాగోలేదు. ఆ పొగాకు కంపినీలో పనిచేసీ చేసీ నలభై ఏళ్ళకే యాభైఏళ్ళ వాడిలా తయారయ్యాడు. ఆయనకి వచ్చే పదిహేను

వందల్లో ఏడువందలు మందులకే సరిపోతున్నాయి. ఇక ఎనిమిది వందలతో ఎలా బతుకుతామనుకుంన్నావురా? తినడం, అరుగుమీద

కూర్చోవడం, ఇదే నీకు తెల్సిన పని! ఇంట్లో ప్రతీదీ కొనడమే! దానికి తోడు నీ అవసరాలకోసం 'నెలకు వంద ఇవ్వు చాలు' అంటావు ఇలా అడిగి

ఇప్పించుకోడానికి సిగ్గులేదురా!  అదేరా మగవాడంటే ... " కోపంగా మాట్లాడుతోంది లక్ష్మిదేవమ్మ.
 "ఈ మాటలు పాతవే" అన్నాడు భావానీశంకర్.
 "నీకు ఎన్నిసార్లు చెప్పినా తలకు ఎక్కడం లేదుకదా?  అయినా చేవిటివాడిముందు శంఖం వూదడం నాదేతప్పు" ఆమె గొంతులో నిష్టురం.