Facebook Twitter
చిత్ర కవిత

"ధీర్ఘాయుష్మాన్ భవా"

చెంగు చెంగున లేగదూడల్లా దూకడం
హాయిగా ఆనందంగా అల్లరిచేయడం
ఆటపాటలతో మునిగితేలడం మరచి
సెల్లిమ్మని మమ్మీ డాడీని గోలచేస్తూ
ఇవ్వకుంటే ఇల్లంతా పీకీపందిరేసే
ఇస్తే తిండనక నిద్రనక ఆకలనక
గంటలతరబడి సెల్లుల్లో గేములాడే
పిల్లలు కాదు పిడుగులున్న ఈరోజుల్లో
ఈ బుడతడు ఎంతోబుద్దిగా
తాను మోయలేనంత బృహత్ గ్రంధాన్ని
ముందేసుకొని పేజీలను తిరగేస్తూ
చదువుకోండిరో బాబు చదువుకోండిరా
చదువుకుంటే మీ బ్రతుకులు చల్లగుండురా
తెలుసుకోండిరో బాబు తెలుసుకోండిరా
తెలుసుకుంటే మీ బ్రతుకున తేనెనిండురా
బడికి పొండిరో బాబు బడికి పొండిరా
బడికిపోతే బ్రతుకున బంగారు పండురా
అంటూ చిరుప్రాయంలోనే చిరుసందేశాన్నందించే ఈ
బుడతడిని ఆశీర్వదిద్దాం"దీర్ఘాయుష్మాన్ భవా"అంటూ