సూక్తులు కాదు సూర్యకిరణాలు
కవి పోలయ్య కలం నుండి స్పూర్తినిచ్చేటి
అవి సూక్తులా కాదు కాదు సూర్యకిరణాలు
అవి విలాసాల వినోదాల విందులు
అవి మాయని గాయాలకు మందులు
అవి మధురమైన మంత్రాలు
అవి ద్వారాలకు మంగళతోరణాలు
అవి సిగ్గులేని ఆఖరి పెగ్గులు
అవి అందమైన ముత్యాల ముగ్గులు
అవి ఘుమ ఘుమలాడే అగరు వత్తులు
అవి వెలుగులు విరజిమమ్మే కొవ్వొత్తులు
అవి సూదులు కాదు కాదు చురకత్తులు
అవి మత్తెక్కించే మరుమల్లెల పూలగుత్తులు
అవి ఆకాశాన విరిసేటి అందాల ఇంద్రధనుస్సులు
అవి హృదయాలు మురిసేటి ఉషోదయపు ఉషస్సులు
అవి చదివినంత మనసంత పులకింత ఏదో గిలిగింత
అవి ఆచరించిన చాలు వినోదభరితమే జీవితమంత
అవి పోలయ్యకవి నిత్యం అందించు అమృతపు గుళికలు
అవి తియ్యతియ్యని చిలకమ్మ పలుకులు తేనె చినుకులు



