Facebook Twitter
పోలన్న సుమధుర సుభాషితం !

విన్న చాలు జీవితం సువర్ణ శోభితం !!

ఎప్పుడూ ఆనందంగానే వుండండి !
అనవసరంగా ఆందోళన చెందకండి!

నిదానమే ప్రధానం అన్నది నిన్నటి మాట!
ఈకంప్యూటర్ యుగంలో వేగమే ప్రధానం!

ఒకింట పేదవాడిగా పుట్టడం తప్పు కాదు!
కానీపేదవాడిగా మరణించడమే పెద్దనేరం!

చిరునవ్వులే చీకటిలో వెలిగే చిరుదీపాలు!
కోపతాపాలే తీరనిశాపాలు నరకకూపాలు!

ప్రతినిత్యం మరువకు సత్యమునే బోధించు!
నటించకు నిన్నునమ్మినవారిని నట్టేటముంచకు!

పురోభివృద్ధికే నీ ఆలోచనలు పునాది కావాలి!
సమయాన్ని సత్సంకల్పాలను సమాధిచేయకు!

ఏనాడైనా ఎవరిని కూడా భయపెట్టకు‌ బాధించకు!
ఎవరైనా ఎప్పుడైనా ఆపదలోవుంటే తక్షణమే ఆదుకో!

బిందువులే సింధువైనట్లు నేటిపొదుపే రేపటిమదుపు!
దేనినీ నేడు వృధా చేయకు రేపు లేదని వ్యధ చెందకు!

కదలని మెదలని ఉలుకు పలుకులేని శిలలా వుండకు!
నిరంతరం ఉవ్వెత్తున ఎగిసిపడే కడలి కెరటంలా వుండు!

నేడు నిరుపేదలకు అనాధలకు ఇష్టంతో ఇచ్చువారు!
రేపు ఆ పరమాత్మ నుండి పుష్కలంగా పుచ్చుకుంటారు!

ఎప్పుడైనా ఏనాడైనా పడినా సరే పైకి లేవడానికి!
పక్షిలాఎగరడానికి మొక్కలాఎదగడానికే ప్రయత్నించు!
ఏనాడు విడిపోవడానికి చెడిపోవడానికి పాతాళంలో

పడిపోవడానికి పతనమైపోవడానికి ప్రయత్నించకు!

ప్రతివారిని ప్రేమించు అందరిలో ఆ దైవాన్ని దర్శించు!
ఎవరినీ అకారణంగా ద్వేషించకు కోపంతోదూషించకు!