అంటరాని ఇంట
పుట్టిననేమిరా
ఉన్నత భావాలు కలిగిన
ఉదార హృదయులైన
మహనీయుల
ఆర్థికఅండతో
విదేశాలకేగే
ఉన్నత విద్యనార్జించేనురా
రాజ్యాన్ని ఏలకున్ననేమిరా
రాజ్యాంగ రచన చేసి
అస్పృశ్యుల చీకటి బ్రతుకుల్లో
అంబేద్కర్ అమృతం కురిపించేనురా