మహా
రాజనీతిజ్ఞుడు
విజ్ఞాన వంతుడు
రాజ్యాంగ నిర్మాత
గొప్ప మేధావి విద్యావేత్త
ప్రజ్ఞాశాలియైన అంబేద్కర్
ప్రధానమంత్రి పదవికి అర్హుడైనా
ఆయనకు అది దక్కనేలేదు
కారణం ఒక్కటే "కుల వివక్షతే"
నాడు బడానేతలందరూ అగడుగునా
ఆయన అభివృద్ధికి అడ్డుపడ్డారు
ఆయన ప్రతిభకుధీటుగా
ఇవ్వవలసినంత ఉన్నతమైన
స్థానాన్ని ఇవ్వలేదు
దక్కవలసినంత గౌరవం దక్కలేదు
ఆయన చైతన్యవంతమైన
జీవిత విశేషాలను వెలుగులోనికితెస్తే
ఇంకెంతమంది అంబేడ్కర్ లు
పూరిగుడిశల్లో పులులై పుడతారో
వారే విజ్ఞానవంతులైతే
ఎక్కడ తమను ఎదిస్తారో
తమ గుండెల్లో నిదురిస్తారో
ఎక్కడ ఎవరెస్టు శిఖరంలా ఎదుగిపోతారో
ఎక్కడ తమ అధికారాన్ని అహంకారాన్ని
అన్యాయాలను అక్రమాలకు ప్రశ్నిస్తారో
ఎక్కడ తమ ప్రభుత్వాలకు
అంతిమ గీతం ఆలపిస్తారో
ఎక్కడ తమ రాజ్యాల
పునాదుల్ని కదిలిస్తారో
కూకటివేళ్లతోసహా పెకలించి వేస్తారో
ఎక్కడ తమ సింహాసనాలను
దక్కించుకుంటారోనని కొందరు
ఉన్మాదులైన మనువాదులు మేధావులు
ఏనాడో రహస్యంగా చీకటిసమావేశాల్లో
చర్చలు జరిపి అడ్డు తగలకుండా
అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు
వాటి పర్యవసానమే, తరతరాలుగా
బహుజనులను విద్యకు దూరం చేశారు.
వీరి మధ్య ఐక్యత లేకుండా చేశారు.
ఆర్థికంగా సామాజికంగా అణగద్రొక్కారు.
ఇంకో 100 సంవత్సరాలకు కూడా
తేరుకుని పైకిరాలేని రీతిలో
మొత్తం జాతినే ఊబిలో త్రోసేశారు
మరో అంబేద్కర్ పుడితే తప్ప
ఈ జాతిఉద్ధరణ ఇప్పట్లో జరగదు లేదా
ప్రత్యామ్నాయంగా మిగిలిన బలహీనవర్గాల
భాగస్వామ్యంతో అంబేద్కర్ ఆశయమైన
రాజ్యాధికారం సాధ్యమే....సుసాధ్యమే...
ఊబిలోనైతేమి ? లోతైనలోయలో నైతేమి ?
పడీన ప్రతిసారి పైకిలేచేవాడే ప్రతిభావంతుడు
విరామమెరుగక విశ్రమించే వాడే విశ్వవిజేత



