Facebook Twitter
దండమయా ఓ అంబేద్కర !

దండమయా ఓ అంబేద్కర ! 

దండమయా ఓ ప్రచండమూర్తి !

దళిత జాతి జ్యోతి !

దండమయా ఓ పండితోత్తమా ! 

దండమయా నీకు నెపుడు 

దండము అంబేద్కర !

 

దండమయా ఓ అంబేద్కర !

దండమయా ఓ సంఘ సంస్కర్త ! 

దళిత జాతి జ్యోతి ! 

దండమయా ఓ రాజ్యాంగ నిర్మాత ! 

దండమయా నీకు నెపుడు 

దండము అంబేద్కర !

 

దండమయా ఓ అంబేద్కర !

దండమయా ఓ దళిత బంధు !

దళిత జాతి జ్యోతి !

దండమయా ఓ దళిత రక్షక ?

దండమయా నీకు నెపుడు 

దండము అంబేద్కర !

 

 

దండమయా దండమయా

ఓ అంబేద్కర ఓ రాజాధిరాజ !

ఓ దళిత భోజ !

ఉండుమయా ఉండుమయా 

నిండుగా మా గుండెల్లో ఓ నిర్మలతేజ!