ప్రత్యక్ష దైవం...
అంటరాని
ఇంట పుట్టిననేమిరా ?
ఉన్నతభావాలు వున్న
ఉదారహృదయులైన
మంచి మనసున్న మహాత్ముల
మహనీయుల మహారాజుల
ఆర్థికఅండతో విదేశాలకేగేనురా
విశ్వవిద్యాలయాలలో
ఉన్నత విద్యనార్జించేనురా
రాజ్యాన్ని
ఏలకున్ననేమిరా ?
రారాజులా రాజ్యాంగ రచన చేసి
అస్పృశ్యుల చీకటి బ్రతుకుల్లో
అమృతం కురిపించేనురా
సిరిసంపదలు
లేకున్ననేమిరా?
శ్రీమంతుడు కాకున్ననేమిరా ?
కృషితో కసితో అకుంఠితదీక్షతో
జ్ఞానతృష్ణతో గట్టిపట్టుదలతో
విజ్ఞానమనే సిరిసంపదలను
ఆనార్జించేనురా
వినువీధుల్లో విమానాల్లో
విదేశాల్లో విహరించేనురా
విశ్వవిజేతగా అవతరించేనురా
ఆ మహావ్యక్తే ఆ అద్భుతశక్తే
అమరజీవి అంబేద్కర్
అణగద్రొక్కబడిన అడుగునున్న
బడుగుజీవులకు "ఆశాకిరణం"...
అభాగ్యులకు అనాధలకు
ఆయనే "శరణం"...
ఆకలికి అలమటించే పేదప్రజలకు
ఆయనే "ప్రత్యక్ష దైవం"...



