ఎవరెస్ట్ శిఖరంలా ఎదగాలంటే?.
ఎన్ని మంచి మాటలు చెప్పినా
ఎన్ని మంచి సలహాలు ఇచ్చినా
ఎన్ని అవకాశాలు అందించినా
ఎన్ని కొత్త మార్గాలు చూపెట్టినా
ఎన్ని చక్కని సందేశాలు పంపినా
స్పందించకుండా వుంటే
ఏ చలనం లేకుండా వుంటే
ముందుకే రాకుండా వెనక్కేవెళ్తుంటే
అన్నీ అనుమానాలే సందేహాలే
అడుక్కుపోయే ఆలోచనలే తప్ప
అభివృద్ధి చెందాలనే తపనే లేకుంటే
ప్రక్కనున్నవారు పదిమెట్లు ఎక్కినా
అడుగుమెట్టునే అతుక్కొని వుంటే
ఎలా బాగుపడతారు ?
ఎలా ఆస్తులు ఆర్జిస్తారు ?
ఎలా ఉన్నతంగా జీవిస్తారు ?
ఎలా నలుగురిలో తలెత్తుకు తిరుగుతారు ?
ఎలా సంఘంలో సమానంగా గౌరవంగా బ్రతుకుతారు?
మీరే మీ గుండెలమీద చెయ్యి వేసుకొని
ఒకసారి పడుకునే ముందు ఆలోచించండి!
మనతప్పులు మనం తెలుసుకోనంతకాలం
మన బలహీనతలు మనం గుర్తించనంతకాలం
మనం ఎలాఎవరెస్ట్ శిఖరంలా ఎదగగలం చెప్పండి!
పేదవారిగా పుట్టడం కాదు,పేదవారిగా మరణించడమే
మహా నేరం, ఘోరం, పాపమని,గుర్తుంచుకుంటే చాలు



