Facebook Twitter
విద్య ద్వారానే సర్వం సాధ్యం

ఓ విజ్ఞగలవిద్యార్ధులారా ! 

పుస్తకం లేదని చదువు ఆపకండి 

విద్యనార్జించండి విశ్వవిజేతలవ్వండి 

ఆత్మగౌరవాన్ని

అంగట్లో సరుకులా అమ్మకండి 

అంబేద్కర్ 

ఆశయాలను కలనైనా మరువకండి

 

ఓ యువతీ యువకులారా !

తిండి లేదని 

పగలు రాత్రి పస్తులుండకండి 

కష్టించి పని చేస్తే 

తప్పక కడుపు నిండుతుంది

చదువుకు, 

సమాజానికెప్పుడూ దూరంగా ఉండకండి 

సంఘంలో సమానత్వం 

విధ్యద్వారానే సాధ్యమని తెలుసుకోండి

 

ఓ తల్లీదండ్రులారా !

మీఇల్లు గడవడం లేదని

మీ పిల్లల చదువులు మాన్పిస్తే 

వాళ్ళు, రాళ్ళుమోసే కూలీలౌతారు

రిక్షావాలాలవుతారు 

కాని కాస్త కష్టపడి చమటోడ్చి 

చదివిస్తే వారు డాక్టర్లవుతారు

జిల్లా కలెక్టర్లవుతారు 

జాతకాలే మారి జాతినేతలౌతారు 

మీకు మీవూరికి ఈదేశానికి

గొప్పపేరుప్రతిష్టలు తెస్తారు 

చితికిన మీ చీకటిజీవితాలకు

వెన్నెల వెలుగులనిస్తారు