Facebook Twitter
పులిలా బ్రతుకు ....

కదలని పులికి 

కడుపెలా నిండుతుంది 

ఆకలితో గుహలో అల్లాడిపోతుంది

నకనకలాడిపోతుంది 

మలమల మాడిపోతుంది  

అందుకే పులి అడవికి వెళ్ళక తప్పదు 

ఆహారం కోసం వెదకక తప్పదు 

మెల్ల మెల్లగా పిల్లిలా 

నక్కినక్కి నడవక తప్పదు 

అవసరమైతే ఆహారం కోసం 

వేల మైళ్ళు వెళ్లక తప్పదు 

దొరికినట్లే దొరికి...

అందినట్లే అంది... 

చిక్కినట్లే చిక్కి.... 

పరుగులు తీసే జింకల కోసం 

నరాలు తెగేలా... 

పరుగులు తీయక తప్పదు 

కారణం, అది గడ్డితినదు గనుక

అందుకే...

ఓ మనిషి బావిలో కప్పలా...

పంజరంలో పక్షిలా...

గదిలో గబ్బిలంలా...బ్రతక్కు...

ఎక్కుపెట్టిన విల్లులా ...

ఎగిరే తారాజువ్వలా...

రగిలే నిప్పు రవ్వలా...

రోడ్డుపై కొచ్చిన వాహనములా...

ఆకలితో ఉన్న పులిలా... బ్రతుకు 

కారణం "వేగమే" నేటి యుగంలో ప్రధానం