కాకిబ్రతుకా? హంసబ్రతుకా?
ఓ నా ప్రియమిత్రమా !
ఎంతకాలమిలా నీవు
అంధకారంలో అజ్ఞానంలో
అమాయకత్వంలో దగ్దమైపోతావ్.....
నీ బలహీనతల నుండి
నీ తరతరాల బానిసత్వపు
మనస్తత్వం వుండి బయట పడాలనుకో...
శిలనుశిల్పాంగా చెక్కాలనుకో...
ఎవరెస్టు శిఖరం ఎక్కాలనుకో ...
నిన్ను ఎదగనీయగుండి పైకి రానీయకుండా
అడుగడుగునా అడ్డుపడిన అణగదొక్కిన
అహాంకారుల వలలో చిక్కకు చింతించకు...
వారి కాలికింది చెప్పులా
ఆ చెప్పుకింది తేలులా బ్రతకాలనుకోకు...
వారి మెడమీద వ్రేలాడే కత్తిలా
వారికి ప్రక్కలో బల్లెంలా బ్రతకాలనుకో...
దహించే అగ్నిలా రగలాలనుకో
ఆకులు మేసే మేకలా కాక
గర్జించే సింహంలా బ్రతకాలనుకో...
కానీ ఓ నా ప్రియమిత్రమా !
కాకిలా బ్రతికితే నీకు దొరికేది
కాటిలో పిండమే....
కాని హంసలా బ్రతికితే
నీవందుకోగలవు అమృత భాండమే...



