Facebook Twitter
ప్రతిభకు పట్టాభిషేకం 

నీవు ఆవులా

అమాయకంగా ఉన్నంతకాలం 

నీవు మేకలా 

మౌనంగా ఉన్నంతకాలం 

నీవు జింకలా

జంకుతున్నంతకాలం 

నీవు బావిలో 

కప్పలా బ్రతుకుతున్నంతకాలం 

సింహాలు నిన్ను 

వెంటాడుతూనే ఉంటాయి 

పులులు నిన్ను 

వేటాడుతూనే ఉంటాయి 

ఓ మనిషీ నిజానికి

నీలో దమ్ముంది 

నీలో ధైర్యముంది 

నీలో గొడ్డుచాకిరీచేసే 

గుణముంది 

నీ లోపగఉంది 

నీలో పట్టుదలఉంది

నీపై వారితో మాట 

పడకూడదనే రోషముంది 

అవసరమైతే నీవు 

గుర్రంలా పరిగెత్తగలవు

ఏనుగులా 

ఏంతటిపనినైనా చేయగలవు 

సంధ్య వేళయిందని

సమయం మించిపోయిందని 

నిరాశ చెందకు

తొలిపొద్దు పొడుస్తుంది 

అదిగో తెల్లవారుతుంది 

అవిగో అరుణకిరణాలు 

అవిగో ఆనందభాష్పాలు 

అదిగో నవలోకం అదిగో నవలోకమే

అది నీ కోసం అది నీ కోసమే 

నీవు నీ ఇష్టదైవాన్ని మొక్కాలి 

నీవు ఎవరెస్టు శిఖరం  ఎక్కాలి

నీకు శ్రమకు ఫలితం దక్కాలి 

నీ ప్రతిభకు పట్టాభిషేకం జరగాలి