Facebook Twitter
కులగోత్రాలు

కులం 

పునాదులమీద

ఒక జాతిని కాని

ఒక నీతిని కాని

నిర్మించలేరన్న 

రాజ్యాంగ నిర్మాత

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 

అమృతవాక్కుల్ని

భారతీయులందరూ 

నా సహోదరులేనని

చేసిన ప్రతిజ్ఞను మరిచిన 

ఓ మనువాదులారా 

ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని 

ఈ కులాల కుంపట్లలో

ఆజ్యం పోస్తూ వుంటారు 

ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని 

రావణకాష్టంలా రగిలే

ఈ అంటరానితనాన్ని

ఆర్పకుండా వుంటారు

తరచి తరచిచూడ 

కళ్ళు తెరిచిచూడ 

ఈ కులగోత్రాలు 

మలమూత్రాలు కాదా

విసర్జించుటే ఈ విశ్వంలో 

నిజమైన విజ్ఞత కాదా

మానవత్వాన్ని 

సమానత్వాన్ని 

మంటకలపనివాడే 

మనసున్న మనువాది కాదా