అపచారం...అవివేకం
అర్హతలేని వాన్ని
అనవసరంగా
ప్రశంసించడం
ఇంద్రుడంటూ
శ్రీరామచంద్రుడంటూ
అదేపనిగా పొగడడం
ఒక "అపచారం"
అట్టి అపచారానికి శిక్ష
మనం అథఃపాతాళానికి పోవడమే
వాడు
మహారాజులా సింహంలా
సింహాసనంపై కూర్చొని
మీసాలు మెలివేస్తుంటే
విజయగర్వంతో
విర్రవీగుతువుంటే
వికటాట్టహాసం చేస్తూవుంటే
రాజభోగాలను అనుభవిస్తూవుంటే
మనం మాత్రం భటులుగా బ్రతకడం
వాడి అడుగులకు మడుగులొత్తడం
ఎంతటి "అవివేకం"? ఎంతటి అజ్ఞానం
మనలో చైతన్యం రగిలేదెప్పుడు?
మనకు కనువిప్పు కలిగేదెప్పుడు?
మనమీ మొద్దునిద్రనుండి మేల్కొనేదెప్పుడు?
ఊహించని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు
కళ్ళనుండి కన్నీటికి బదులు రక్తమొచ్చినప్పుడు



