రండి రండి ! కదలిరండి !
దశదశాబ్దాలుగా దగాపడ్డ
ఓ బహుజన బిడ్డలారా!
అంబేద్కర్ ఆత్మసాక్షిగా
మీకిదే నా అక్షర సందేశం
అంటరానితనం
ఒక ఆరని అగ్నిగుండం
ఆర్పకపోతే దాన్ని అందదు
మనకు అమృతభాండం
రాళ్ళలో రత్నాలున్నట్లే,
మట్టిలోమాణిక్యాలున్నట్లే,
మనజాతిలోనూ
నవరత్నాలున్నాయి,
మణిమాణిక్యాలున్నాయి
వెలికి తీద్దాం రండి.
వారికి వెలుగు చూపిద్దాంరండి
వారిలో చైతన్యాన్ని
రగిలిద్దాంరండి.
ఎన్నోఏళ్ళుగా ఎండకుఎండిన
నేలకు రాలిన చక్కని
మొక్కలెన్నోఉన్నాయి
నీరుపోద్దాం రండి.
పూలుపూసే, కాయలుకాసే
కడుపులు నింపే
పచ్చనివృక్షాలుగా మారుద్దాంరండి
అంబేద్కర్ ఆశయాలే లక్ష్యంగా
ముందుకు సాగుదాం రండి!
రండి కదలి రండి! కదం తొక్కండి!
కత్తులు ఝులిపించండి!
సింహాలై ఘర్జించండి!
పులులై పోరాడండి!
రక్తతర్పణకైనా సిద్దం కండి!
రాజ్యాధికారం సాధిద్దాం రండి!
రండి రండి ! కదలి రండి !
అందరు ఒక్కటై కలిసి రండి!



